2025 Cars: 2025లో రిలీజ్ కోసం నయా కార్ల క్యూ.. ముందు వరుసలో ఆ కంపెనీ ఎస్‌యూవీలు

|

Jan 04, 2025 | 3:17 PM

ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. అయితే కొత్త ఏడాది సరికొత్తగా ఉండాలని కొంత మంది కార్లు, బైక్‌లు వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త ఏడాది సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటాయి. 2025లో రీలీజయ్యే అవకాశం ఉన్న కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

2025 Cars: 2025లో రిలీజ్ కోసం నయా కార్ల క్యూ.. ముందు వరుసలో ఆ కంపెనీ ఎస్‌యూవీలు
Follow us on

2025 కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రజలు కొత్త కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారు. ఆటో కంపెనీలు కూడా కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కోసం చాలా కంపెనీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎక్స్‌పో సందర్భంగా కొత్త వాహనాలను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. భారతీయ కార్ మార్కెట్లో మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. 2025లో లాంచ్ కానున్న అనేక వాహనాలు కొత్త ఎస్‌యూవీలు కాగా, ఇప్పటికే ఉన్న ఎస్‌యూవీల్లో కొన్ని ఫేస్‌లిఫ్ట్ సిరీస్‌లు కూడా చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆటో ఎక్స్‌పో రిలీజయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి బ్రెజ్జా గేమ్ ఛేంజర్ మోడల్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ కారను 2022లో అప్‌డేట్ చేశారు. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి ఇతర కార్లతో పోటీ పడుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ 2025లో ఒక పెద్ద ఫేస్‌లిఫ్ట్‌ను పొందుతుందని అంచనా వేస్తున్నారు. మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ అనేక ఫీచర్ అప్‌గ్రేడ్‌లు, ఆధునిక హంగులతో వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్రెజ్జాకు సంబంధించిన బంపర్, ఎల్ఈడీ లైటింగ్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే క్యాబిన్ లోపల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్‌‌తో లాంచ్ చేసే అవకాశం ఉంది. 

మహీంద్రా థార్

2024లో మహీంద్రా థార్ మహీంద్రా థార్ రాక్స్ రూపంలో కొత్త అప్‌గ్రేడ్‌ను తీసుకొచ్చారు. మహీంద్రా థార్ రాక్స్ విక్రయంతో మెరుగైన సౌకర్యాన్ని అందిస్తూ 2025లో మహీంద్రా మూడు-డోర్ల థార్‌కు కొత్త అప్‌డేట్ ఇవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఫ్రంట్ బంపర్, ట్వీక్డ్ ఎల్ఈడీ డిజైన్‌తో అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ వెన్యూ 2025లో పెద్ద ఫేస్‌లిఫ్ట్‌ను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే వెన్యూ నయా వెర్షన్ ట్రయల్ రన్ పూర్తయ్యింది. ఈ కారు హ్యుందాయ్ క్యాస్పర్ వంటి చాలా అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్‌తో వస్తుందని భావిస్తున్నారు. కొత్త గ్రిల్, కొత్త డిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, అప్‌డేట్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు వంటి ఫీచర్లను ఈ కారులో ఉండే అవకాశం ఉంది. 

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్

స్కోడా కుషాక్ భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి ఆ కంపెనీకు సంబంధించిన ప్రధాన ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది. ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పటికే చాలా ప్రజాదరణ పొందింది. దీంతో స్కోడా కుషాక్‌ను అప్‌డేట్ చేసే పనిలో ఉంది. స్కోడా కుషాక్ 2025లో ఫేస్‌లిఫ్ట్‌తో ప్రారంభించే అవకాశం ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి