Bank Alert: బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 10లోగా ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత!

Bank Alert: మీకు ఈ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా..? అయితే మీకో బిగ్‌ అలర్ట్‌. ఏప్రిల్‌ 10వ తేదీ లోపు బ్యాంకు కస్టమర్లు ఈ పని చేయడం చాలా ముఖ్యం. ఆ పనిలో విఫలమైతే బ్యాంకు అకౌంట్‌ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దీంతో సదరు బ్యాంకు ముందస్తుగానే తన కస్టమర్లకు సందేశం అందించింది. మరీ ముఖ్యమైన పని ఏంటో తెలుసుకుందాం..

Bank Alert: బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 10లోగా ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత!

Updated on: Mar 26, 2025 | 3:53 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్లు తమ KYC (నో యువర్ కస్టమర్) వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ఏప్రిల్ 10 లోపు తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని బ్యాంక్ (PNB) కస్టమర్లను కోరింది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ సేవలలో ఎటువంటి అంతరాయం కలగకూడదనుకుంటే, నిర్ణీత గడువులోగా ఈ కేవైసీని పూర్తి చేయాలని బ్యాంక్ సూచించింది.

కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడంలో విఫలమైన కస్టమర్ల ఖాతాలు నిలిపివేయనున్నట్లు సదరు బ్యాంకు తెలిపింది. అందుకే మీరు కూడా పీఎన్‌బీ కస్టమర్ అయితే మీ కేవైసీ సమాచారం అప్‌డేట్‌ చేసి ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. మీ కేవైసీపూర్తి కాకపోతే, ఖచ్చితంగా మీ కేవైసీ చేయండి. మీ ఖాతా నిలిచిపోకుండా కాపాడుకోండి. ఈ పనిని మీరు ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంట్లోనే ఉండి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం ఎలా?

  • దీని కోసం ముందుగా Google Play Store లేదా Apple App Store నుండి PNB One యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • మీ ఆధారాలతో లాగిన్ అవ్వండి.
  • యాప్‌లో KYC అప్‌డేట్ ఆప్షన్‌కి వెళ్లండి.
  • మీ కేవైసీ అప్‌డేట్‌ ఉందో లేదో తనిఖీ చేయండి. స్టేటస్ పెండింగ్ అప్‌డేట్ చూపిస్తే ‘అప్‌డేట్ KYC’ పై క్లిక్ చేయండి.
  • OTP ఆధారిత ఆధార్ ధృవీకరణ ప్రక్రియ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించండి.
  • ఆధార్‌తో లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. ఓటీపీ ధృవీకరణ కోసం మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి. దీని తర్వాత మీ కేవైసీ పూర్తవుతుంది.

ఆఫ్‌లైన్ KYC పద్ధతి

  • అవసరమైన పత్రాలు, ఫోటోకాపీలతో మీ సమీపంలోని పంజాబ్‌ నేషన్‌ బ్యాంకు శాఖను సందర్శించండి.
  • బ్యాంక్ అందించిన కేవైసీ అప్‌డేట్ ఫారమ్‌ను పూరించండి. తగిన పత్రాలను అందించండి. బ్యాంక్ ధృవీకరణ కోసం వేచి ఉండండి.
  • మీ KYC అప్‌డేట్ పూర్తయిన తర్వాత మీకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుండి నిర్ధారణ సందేశం వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి