PNB Bank Customer Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఈనెల 31లోపు ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు ఈ పని చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అదే KYC చేసుకోవడం. KYCని అప్‌డేట్ చేయాలని బ్యాంక్ కస్టమర్‌లకు విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులందరూ 31 ఆగస్టు 2022 నాటికి KYCని పూర్తి చేయాలని బ్యాంక్ ట్వీట్ చేసింది. గత కొన్ని నెలలుగా కేవైసీ చేసుకోలేని వారు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి అని చెబుతూ వస్తోంది. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగియనుంది. KYC చేయడం ద్వారా కస్టమర్ల బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే కస్టమర్ నిధులను బదిలీ చేయలేరు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ చేస్తూ, ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, కస్టమర్లందరికీ KYC అప్‌డేషన్ తప్పనిసరి. 31.03.2022 నాటికి మీ ఖాతా KYC అప్‌డేట్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లయితే, ఈ లోపు మీ KYCని అప్‌డేట్ చేయడానికి కస్టమర్లు బ్రాంచ్‌ను సంప్రదించాలని కోరింది. అప్‌డేట్ చేయకపోతే మీ ఖాతా లావాదేవీలపై నిషేధం ఏర్పడవచ్చు.
Important announcement regarding #KYC, please note! pic.twitter.com/2RSJrZxxMf
— Punjab National Bank (@pnbindia) August 17, 2022
ఆన్‌లైన్ ద్వారా కేవైసీ..
మీరు ఇంట్లో కూర్చొని KYC చేయాలనుకుంటే దీని కోసం మీరు మీ డాక్యుమెంట్ బ్యాంక్‌కు ఈ-మెయిల్ చేయవచ్చు. లేదా ఆధార్ ద్వారా మొబైల్‌లో OTP అడగడం ద్వారా కూడా మీరు KYC పూర్తి చేయవచ్చు. చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా KYC సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. మీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లయితే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కాకుండా మీరు నేరుగా బ్యాంకు వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. అందుకు ఆధార్, పాన్ కార్డు సమర్పిస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి