PUC Certificate: కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడిపోతున్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఇక ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పెట్రోల్ బంకుల్లో పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయనుంది. ఈ సర్టిఫికేట్‌ను చూపిస్తేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసేలా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు ప్రజల అభిప్రాయాన్ని కోరింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం అమలు అయితే ఢిల్లీలో కాలుష్యం వెలువడే వాహనాలను నడపకుండా చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. వాహనదారులు పోల్యూషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్‌ను పెట్రోల్ బంకుల్లో చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ చూపించిన సర్టిఫికేట్ చెల్లదని తేలినట్లయితే బంకులలోనే జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా.. జనవరి 1, 2022 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు తెలిపింది. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెట్రోల్ వాహనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి: