FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలలో వడ్డీ రేట్లు ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. కాబట్టి డెట్ ఇన్వెస్టర్‌లు అధిక రేట్లతో మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్ కోసం వెతకడానికి ఇది ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా.. పెట్టుబడిదారులు అధిక వడ్డీ రేట్లను మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడాన్ని కూడా పరిగణిస్తారు. అందువల్ల మేము తాజాగా వడ్డీ రేట్ల పెంపును ప్రకటించిన ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), కెనరా బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూస్తున్నాము. ఇందులో 2 కోట్ల రూపాయలు వరకు పెట్టే పెట్టుబడులపై సదరు బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
SBI:
ముందుగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఫిబ్రవరి 15, 2022 న వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇవి రూ. 2 కోట్ల వరుకు ఉన్న అన్ని టర్మ్ డిపాజిట్లపై వర్తిస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి..
BOB:
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఫిబ్రవరి 25, 2022న ఒక సంవత్సరం డిపాజిట్లపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ కాలానికి వడ్డీ రేటు గతంలో ఉన్న 4.90 శాతం వడ్డీ రేటును 5 శాతానికి పెంచింది. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య కాలానికి చేసే టర్మ్ డిపాజిట్లపై గతంలో ఇస్తున్న 5 శాతం వడ్డీ రేటును 5.10 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి తోడు వివిధ కాలపరిమితుల డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేట్లను ఇక్కడ గమనించండి..
Canara Bank:
ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు మార్చి 1, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అంతకుముందు 5% నుంచి 5.1 శాతానికి పెంచబడింది. అయితే రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేటు 5% నుంచి 5.15 శాతానికి పెంచబడింది. ముందుగా. 2-3 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు మునుపటి 5.1% నుంచి 5.20 శాతానికి, 3-5 సంవత్సరాల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ 5.25 శాతం నుంచి 5.45 శాతం వరకు పెరిగాయి. 5-10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్లాబ్‌ను గతంలో 5.25% నుంచి 5.5 శాతానికి బ్యాంక్ పెంచింది. సీనియర్ సిటిజన్‌లకు అన్ని కాల వ్యవధిలోని డిపాజిట్లపై.. 50 బేసిస్ పాయింట్ల అదనపు రేటును చెల్లించనుంది.
ఇవీ చదవండి..
TCS Share Buyback: టీసీఎస్ సంచలన నిర్ణయం.. వాటిని మళ్లీ రిటర్న్ చేసుకుంటున్న టెక్ దిగ్గజం..
Tax optimiser: జీతం పెరిగి మీరు పన్ను పరిధిలోకి వచ్చారా.. అయితే ఇలా పన్నును 66 శాతం తగ్గించుకోండి..