Business Idea: తక్కువ పెట్టుబడతో నెలకు రూ.1 లక్ష సంపాదన! క్రేజీ బిజినెస్‌

భారతదేశంలో పెట్ ఫుడ్, యాక్ససరీస్ వ్యాపారం అత్యంత లాభదాయకంగా మారుతోంది. కేవలం రూ. 50 వేల నుండి 2 లక్షల పెట్టుబడితో ఇంటి నుండే లేదా ఆన్‌లైన్‌లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పెంపుడు జంతువుల యజమానులు పెరుగుతుండటంతో, ఉత్పత్తులపై 20-50 శాతం లాభాలు, నెలకు రూ. 50 వేల నుండి లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

Business Idea: తక్కువ పెట్టుబడతో నెలకు రూ.1 లక్ష సంపాదన! క్రేజీ బిజినెస్‌
Indian Currency

Updated on: May 15, 2026 | 7:30 AM

దేశంలో పెంపుడు జంతువులను పెంచుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పెట్ ఫుడ్ అండ్‌ యాక్ససరీస్ వ్యాపారం లాభదాయకమైన చిన్న వ్యాపారంగా మారుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ఆహారం, షాంపూలు, బెల్టులు, టాయ్స్‌, బెడ్స్‌, డ్రెస్సులు కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఈ రంగంపై యువత ఆసక్తి చూపుతున్నారు.

నిపుణుల ప్రకారం ఈ వ్యాపారాన్ని సుమారు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల మధ్య పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మొదట చిన్న స్థాయిలో పెట్ ఫుడ్‌, బెల్టులు, ఫీడింగ్ బౌల్స్‌, టాయ్స్‌, గ్రూమింగ్ ఉత్పత్తులను స్టాక్‌లో ఉంచి షాప్‌ లేదా ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు చేయవచ్చు. షాప్‌ అద్దెకు తీసుకోకుండా ఇంటి నుంచే ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది.

ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా స్థానిక మార్కెట్‌లో డిమాండ్ ఏ ఉత్పత్తులకు ఉందో తెలుసుకోవాలి. తర్వాత హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదించి తక్కువ ధరలకు సరుకులు కొనుగోలు చేయాలి. పెట్ ఫుడ్ బ్రాండ్లు, ట్రీట్స్‌, టాయ్స్‌, మెడికల్ యాక్ససరీస్ వంటి ఉత్పత్తులను క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. పెట్ గ్రూమింగ్‌, హోమ్ డెలివరీ సేవలు కలిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

లాభాల విషయానికి వస్తే సాధారణంగా పెట్ ఉత్పత్తులపై 20 శాతం నుంచి 50 శాతం వరకు మార్జిన్ లభిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. మంచి కస్టమర్ బేస్ ఏర్పడితే నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా రెగ్యులర్‌గా ఫుడ్ కొనుగోలు చేసే కస్టమర్లు ఉండటం ఈ వ్యాపారానికి పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు. అయితే ప్రారంభ దశలో కస్టమర్లను ఆకర్షించడం కొంత సవాలుగా మారవచ్చు. ఉత్పత్తుల నాణ్యత బాగోలేకపోతే కస్టమర్లు వెంటనే మారిపోతారు. అలాగే, ఆన్‌లైన్ పోటీ కూడా ఎక్కువగా ఉండటంతో సరైన మార్కెటింగ్ అవసరం అవుతుంది. అయినప్పటికీ, పెంపుడు జంతువుల సంరక్షణపై పెరుగుతున్న అవగాహన కారణంగా ఈ రంగానికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us