Post Office Saving Scheme
ఇండియన్ పోస్ట్ తన పెట్టుబడిదారుల విభిన్న డిమాండ్లను తీర్చడానికి అనేక పెట్టుబడి పథకాలను అందిస్తుంది. అన్ని పోస్టాఫీసు పొదుపు పథకాలు భారత ప్రభుత్వం ద్వారా స్పాన్సర్ చేస్తుంన్నందున రాబడికి హామీ ఇస్తాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి ప్రోగ్రామ్‌లలో ఎక్కువ భాగం సెక్షన్ 80 సీ కింద పన్ను-మినహాయింపు పొందింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) అలాంటి ప్రసిద్ధ పథకాల్లో ఒకటిగా ఉంది. ఇది ఏదైనా పోస్టాఫీసు శాఖలో ప్రారంభించబడే స్థిర-ఆదాయ పెట్టుబడి కార్యక్రమంగా మారింది. చందాదారులను ప్రధానంగా చిన్న, మధ్య-ఆదాయ ప్రజలను పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పోస్టాఫీసు పథకంలో 5 సంవత్సరాల పాటు రూ. 15 లక్షలు డిపాజిట్‌తో రూ. 21.73 లక్షల రాబడిని పొందవచ్చు.
ఎన్‌ఎస్‌సీ పథకానికి అర్హతలు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ మంచి రాబడినిస్తుంది. ఈ పథకంలో వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంటుంది. అలాగే ఈ పథకంలో కనిష్ట పెట్టుబడి రూ. 1,000గా ఉంటే గరిష్ట పెట్టుబడికి మాత్రం పరిమితి లేదు. అలాగే లాక్-ఇన్-పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. అలాగే రిస్క్ ప్రొఫైల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పథకంలో సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఈ పథకంలో భారతీయ పౌరులు మాత్రమే తీసుకోవడానికి అర్హులుగా ఉంటుది.
రూ. 15 లక్షలు పెట్టుబడితో రాబడి ఇలా
- ఎన్‌ఎస్‌సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం రూ. 1,000గా ఉంటే గరిష్ట పరిమితి లేదు. అలాగే ఈ పథకంలో కలిసి పెట్టుబడి పెట్టడానికి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.
- మైనర్లకు, వారి తల్లిదండ్రులు వారి తరపున పెట్టుబడి పెట్టవచ్చు.
- రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా, 7.7 శాతం వడ్డీ రేటుతో రూ. 6,73,551 వడ్డీని పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 21,73,551 కార్పస్‌ను ఆర్జించవచ్చు.
ఎన్‌ఎస్‌సీ దరఖాస్తుకు అవి మస్ట్
- ఎన్‌ఎస్‌సీ దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించి సమర్పించాలి.
- పెట్టుబడిదారులకు పాస్‌పోర్ట్, శాశ్వత ఖాతా నంబర్ (పాన్) కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, సీనియర్ సిటిజన్ ఐడీ లేదా ధ్రువీకరణ కోసం ప్రభుత్వ ఐడీ వంటి అసలు గుర్తింపు రుజువు అవసరం.
- ఎన్‌ఎస్‌సీ కోసం ఫోటోను కూడా సమర్పించాలి.
- చిరునామా రుజువు కోసం, పెట్టుబడిదారునికి ఈ పత్రాలలో ఏదైనా అవసరం. పాస్‌పోర్ట్, టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, చెక్‌తో పాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అవసరం
మెచ్యూరిటీ కాలం, అకాల ఉపసంహరణ
ఎన్‌ఎస్‌సి పెట్టుబడులను ఐదేళ్ల మెచ్యూరిటీ కాలానికి ముందు ఉపసంహరించుకోలేరు. అయితే నిర్దిష్ట పరిస్థితులలో, ముందస్తు ఉపసంహరణ అనుమతించవచ్చు.
ముందస్తు ఉపసంహరణ నియమాలు
- సర్టిఫికేట్ హోల్డర్ మరణించిన సందర్భంలో ముందస్తు ఉపసంహరణకు అనుమతించవచ్చు.
- సర్టిఫికేట్ జప్తుపై కూడా ముందస్తు ఉపసంహరణ చేసుకోవచ్చు. ప్రతిజ్ఞ చేసే వ్యక్తి గెజిటెడ్ ప్రభుత్వ అధికారి అయి ఉండాలి.
- జడ్జి ఆదేశిస్తే పెట్టుబడి పెట్టిన నగదును వెనక్కి తీసుకోవచ్చు.
- నిధులను ఉపసంహరించుకోవడానికి, సర్టిఫికేట్ హోల్డర్ తప్పనిసరిగా నిర్దిష్ట డాక్యుమెంటేషన్‌ను అందించాలి.