PM Shram Yogi Mandana Yojana: ప్రతీ నెలా రూ. 55 జమ చేస్తే.. పెన్షన్ రూ. 3 వేలు పొందొచ్చు.! వివరాలివే

|

Jun 19, 2021 | 9:53 AM

ప్రధానమంత్రి శ్రామ్ యోగి మంధన్ యోజనతో అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉందని, 45 లక్షలకు పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ది..

PM Shram Yogi Mandana Yojana: ప్రతీ నెలా రూ. 55 జమ చేస్తే.. పెన్షన్ రూ. 3 వేలు పొందొచ్చు.! వివరాలివే
Money
Follow us on

ప్రధానమంత్రి శ్రామ్ యోగి మంధన్ యోజనతో అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉందని, 45 లక్షలకు పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. ఈ పధకం ద్వారా లబ్దిదారులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదొక పెన్షన్ స్కీం, దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందజేస్తారు. ఈ పెన్షన్ పథకంలో, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రతీ నెలా రూ. 3 వేల పెన్షన్ ఇవ్వబడుతుంది. దీని కోసం, వారంతా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అది వయస్సు ఆధారంగా నిర్ణయించబడుతుంది.

ప్రధానమంత్రి శ్రామ్ యోగి మంధన్ యోజన?

మోడీ ప్రభుత్వం ఈ పెన్షన్ పథకం అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రవేశపెట్టింది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. దీని ప్రీమియం వయస్సు ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ పధకంలో చేరిన లబ్దిదారులు నెలకు రూ .3000 చొప్పున.. సంవత్సరానికి రూ .36,000 పెన్షన్ పొందుతారు. ఈ పథకం వల్ల 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రయోజనం పొందుతున్నాయి. ఇందుకోసం 3.52 లక్షల సాధారణ సేవా కేంద్రాలు కూడా ఉన్నాయి.

చెల్లించాల్సిన ప్రీమియం ఎంత?

మీరు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పెన్షన్ స్కీంలో జాయిన్ అయితే.. నెలకు ప్రీమియం రూ .55 నుండి 200 వరకు ఉంటుంది. అదే సమయంలో, 30 ఏళ్లు ఉన్నవారు 100 రూపాయలు, 40 ఏళ్లు ఉన్నవారు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఎవరికి ప్రయోజనం వస్తుంది?

ప్రధానమంత్రి శ్రామయోగి మంధన్ పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ కోసం సమీప సీఎస్‌సీ కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతీ నెలా మీ ఖాతా నుండి పదవీ విరమణ కోసం డబ్బు జమ అవుతూ వస్తుంది. లబ్దిదారుడి దగ్గర నుంచి కట్ అయిన అదే మొత్తాన్ని.. ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ పధకానికి అర్హులు.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!