330 పెట్టుబడిపై 2 లక్షల ప్రయోజనం.. కానీ ఈ వయసు వారికి మాత్రమే..!

|

Mar 10, 2022 | 7:41 AM

PMJJBY: ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలోని ప్రతి వర్గానికి సరైన న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు ధనిక, మధ్యతరగతి వాళ్లు మాత్రమే బీమా పాలసీ తీసుకునేవారు. కానీ ఇప్పుడు

330 పెట్టుబడిపై 2 లక్షల ప్రయోజనం.. కానీ ఈ వయసు వారికి మాత్రమే..!
Pmjjby
Follow us on

PMJJBY: ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలోని ప్రతి వర్గానికి సరైన న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు ధనిక, మధ్యతరగతి వాళ్లు మాత్రమే బీమా పాలసీ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పేద ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అటువంటి అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). ఇది ఇప్పటికే చాలామందికి తెలుసు. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఈ ప్లాన్ కింద మీరు వార్షిక ప్రీమియం రూ. 330 చెల్లిస్తే చాలు. సంవత్సరం పాటు మీ కుటుంబానికి భరోసానిస్తుంది. ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి వార్షిక ప్రీమియం రూ.330 డిపాజిట్ చేయాలి.ఈ బీమా టర్మ్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ పథకం వ్యవధి ప్రతి సంవత్సరం మే 31 వరకు ఉంటుంది. ఈ పథకాన్ని కొనుగోలు చేయడానికి మీ వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని గుర్తుంచుకోండి. ఈ పథకంలో ప్రీమియం జూన్ 1వ తేదీన బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒక ప్రమాద బీమా పథకం. దీని ద్వారా 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీని పొందుతారు. సంవత్సరానికి 330 చెల్లిస్తే చాలు. ఈ ఇన్సూరెన్స్ సొమ్ము పొందడానికి నామినీ బ్యాంకును సంప్రదించి తన ఆధార్ కార్డును చూపించాలి. తర్వాత బీమా చేసిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని చూపడం ద్వారా మీరు డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. మీరు LIC శాఖను సందర్శించడం ద్వారా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు నుంచి ఫారమ్‌ను తీసుకొని బ్యాంక్‌కు సమర్పించడం ద్వారా కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

బలహీనంగా ఉన్నవారికి ఈ 3 ఆయుర్వేద మందులు బెస్ట్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ అస్సలు ఉండవు..!

Zodiac Signs: ఈ 3 రాశుల అమ్మాయిలు భర్తల విజయంలో పెద్ద పాత్ర పోషిస్తారు..!

Viral Photos: ఈమె ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్‌ మెకానిక్.. పార్ట్‌ టైమ్‌ మోడలింగ్‌..!