PPF Scheme: పీపీఎఫ్‌ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ప్రతి నెల రూ.1000 డిపాజిట్‌తో చేతికి రూ.12 లక్షలు.. పూర్తి వివరాలు

|

Jan 18, 2022 | 6:54 AM

PPF Scheme: చేతిలో డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో..

PPF Scheme: పీపీఎఫ్‌ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ప్రతి నెల రూ.1000 డిపాజిట్‌తో చేతికి రూ.12 లక్షలు.. పూర్తి వివరాలు
Follow us on

PPF Scheme: చేతిలో డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్స్‌ పొందే పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్‌ కూడా ఒకటి. ఇందులో ఎలాంటి రిస్క్‌ ఉండదు. నేషనల్‌ సేవింగ్స్‌ ఆర్గనైజేషన్‌ అనే స్కీమ్‌ను చిన్న పొదుపుగా ప్రారంభించడం జరిగింది. ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీపీఎఫ్ నుంచి మెరుగైన రాబడులు పొందవచ్చు. ప్రతి నెలా కేవలం రూ.1000 డిపాజిట్ చేయడం ద్వారా రూ.12 లక్షలకు పైగా పొందవచ్చు. దీన్ని 1968లో ప్రారంభించింది.

ఎంత వడ్డీ

కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో పీపీఎఫ్‌ (PPF)ఖాతాపై వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. వడ్డీ రేటు సాధారణంగా 7 శాతం నుండి 8 శాతం వరకు ఉంటుంది, ఇది ఆర్థిక పరిస్థితిని బట్టి కొద్దిగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు 7.1 శాతం ఉంది. చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. మీరు పీపీఎఫ్‌ (PPF) ఖాతాలో ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. దీని తర్వాత, మీరు ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మీరు ప్రతి 5 సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేయవచ్చు.

మీరు పీపీఎఫ్‌ (PPF) ఖాతాలో ప్రతి నెలా రూ. 1000 డిపాజిట్ చేస్తే, 15 సంవత్సరాలలో మీ పెట్టుబడి మొత్తం రూ. 1.80 లక్షలు అవుతుంది. దీనిపై రూ.1.45 లక్షల వడ్డీ లభిస్తుంది. అంటే, మెచ్యూరిటీ తర్వాత, మీరు మొత్తం రూ. 3.25 లక్షలు పొందుతారు. ఇప్పుడు మీరు PPF ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించి, ప్రతి నెలా రూ. 1000 పెట్టుబడిని కొనసాగిస్తే, మీ మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 2.40 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై రూ.2.92 లక్షల వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా మెచ్యూరిటీ తర్వాత మీరు రూ. 5.32 లక్షలు పొందుతారు.

అలాగే మీరు 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం (మొత్తం 30 సంవత్సరాలు) తర్వాత 5 సంవత్సరాల చొప్పున మూడుసార్లు పొడిగించినట్లయితే ప్రతి నెలా రూ.1000 ఇన్వెస్ట్ చేయడం కొనసాగిస్తే, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.3.60 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి మొత్తం మెచ్యూరిటీపై రూ.12.36 లక్షలు పొందవచ్చు. ఇలా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో డబ్బులను ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. అందుకే చాలా మంది ఇలా స్కీమ్‌లను ఎంచుకుంటారు. ప్రతి నెలా కొంత మొత్తం డిపాజిట్ చేసుకుంటూ వెళితే మెచ్యూరిటీ సమయం ముగిన తర్వాత మంచి లాభం ఉంటుంది.

పీపీఎఫ్‌పై రుణం

మీరు పీపీఎఫ్‌ స్కీమ్‌పై రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆరు సంవత్సరాల మీరు కొంత మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

e-Shram Registration: 20 కోట్లకు చేరుకున్న ఇశ్రమ్ రిజిస్ట్రేషన్స్‌.. రూ.2 లక్షల బీమా.. నిబంధనలు పాటించకుంటే రద్దు

Pension Increase: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. నెలవారీ పెన్షన్‌ రూ.9000కు పెరగనుందా..?