Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మార్కెట్‌లో ఒక్కోసారి

Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో
Silver Price Today
Follow us

|

Updated on: Jan 18, 2022 | 6:32 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మార్కెట్‌లో ఒక్కోసారి బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం కూడా వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా కిలో వెండి ధర 62,000 లుగా ఉంది. కిలో వెండిపై రూ.300 మేర పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,000 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,000 లుగా కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,500లుగా ఉంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర 62,000లుగా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. * కేరళలో కిలో వెండి ధర 65,500 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. * విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. * విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,500 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదంటున్నా నిపుణులు.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. 

PM Narendra Modi: మా దేశంలో పెట్టుబడులకు ఇదే అనువైన సమయం: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోడీ..