PPF Rules: పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ సర్వీసులకు నో చార్జెస్..!

భారతదేశంలోని ప్రజలు చాలా ఏళ్లుగా పెట్టుబడి కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రభుత్వ భరోసాతో రాబడితో పాటు పెట్టుబడికి హామీ ఉండడంతో ఈ పొదుపు పథకాలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఇటీవల పెట్టుబడిదారులు పెరిగారు. మంచి వడ్డీ రేటుతో పాటు ధీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండడంతో ఉద్యోగస్తులు ఎక్కువగా ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలను సవరించింది.

PPF Rules: పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ సర్వీసులకు నో చార్జెస్..!
Ppf Updates

Updated on: Apr 26, 2025 | 7:57 PM

బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం ఇకపై ఖాతాదారులు ఇప్పుడు తమ డిపాజిట్ చేసిన డబ్బు, సేఫ్ వస్తువులు, లాకర్లకు 4 నామినీలను జోడించే అవకాశం ఉంది. దీంతో పాటు పీపీఎఫ్ ఖాతాలో నామినీని వివరాలను అప్‌డేట్ చేసేందుకు వసూలు చేసే రుసుమును కూడా తొలగించారు. ఈ మేరకు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం 2 ఏప్రిల్ 2025న ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్ (2018)ను సవరించింది. ఈ సవరణ ద్వారా నామినీని అప్‌డేట్ చేయడానికి వసూలు చేసే రూ. 50 రుసుమును తొలగించారు. దీంతో పీపీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఎలాంటి ఖర్చు లేకుండా వారి నామినీ సమాచారాన్ని సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇటీవల ఆమోదించిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025ను హిందీ, ఆంగ్లంలో గెజిట్ నోటిఫికేషన్‌లను కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

పీపీఎఫ్ ఖాతాలో నామినీ అప్ డేట్ ఎందుకు చేసుకోవాలి? 

పీపీఎఫ్ ఖాతాదారులంతా పీపీఎఫ్ ఖాతాలోని నామినీని అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పీపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ మనఖాతా నిధులను సులభంగా, త్వరగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. నామినీ లేకుండా ఖాతాను క్లెయిమ్ చేయడం కష్టం కావచ్చు. అలాగే ఈ ప్రక్రియ సుదీర్ఘంగా ఉండవచ్చు.

పీపీఎఫ్ ఖాతాను తెరవడం ఇలా

పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. దీంతో పాటు మైనర్ కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఆ ఖాతా మెచ్యూర్ అయ్యాక మీరు మొత్తం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అయితే మెచ్యూర్ అయిన సందర్భంలో మీకు డబ్బు అవసరం లేకపోతే మీరు దానిని మరో 5-5 సంవత్సరాలు పొడిగించవచ్చు. అయితే మెచ్యూరిటీ ఒక సంవత్సరం ముందు దానిని పొడిగించాలనే నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఈ ఖాతా దీర్ఘకాలిక పెట్టుబడిగా ఒక అద్భుతమైన ఎంపిక అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి