Post Office: మీరు భవిష్యత్‌లో మీ సంపాదనను పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసులోని పొదుపు పథకాలు చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితం. బ్యాంకు డిఫాల్ట్ అయితే మీరు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇది కాకుండా, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు.పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లేదా FD కూడా ఒకటి. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.
పోస్టాఫీసులో 1-సంవత్సరం FD ఖాతాను ఓపెన్ చేయడం ద్వారా సంవత్సరానికి 5.5% వడ్డీ లభిస్తుంది. రెండు సంవత్సరాలకి, మూడు సంవత్సరాలకి, ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీలో మార్పు ఉంటుంది. పోస్టాఫీసులో 5 సంవత్సరాల FDపై అత్యధిక వార్షిక వడ్డీ 6.7 శాతం లభిస్తుంది. వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు కానీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. పోస్టాఫీసు FDలో కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. పోస్టాఫీసు పథకంలో ఒక వయోజన లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా మైనర్ తరపున సంరక్షకుడు ఖాతా ఓపెన్ చేయవచ్చు.
5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతుంది. పోస్టాఫీసు FD ఖాతా తెరిచిన తేదీ నుంచి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల ముగింపులో మొత్తం తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ కాలం ముగిసాక వ్యక్తి కావాలంటే మరో కొంతకాలం పొడగించుకునే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం FD మెచ్యూరిటీపై 6 నెలలు. 2 సంవత్సరాల FD ఖాతాలో 12 నెలలు పెంచుకోవచ్చు.