పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం ఇచ్చే సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

Post Office: జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడ దాచుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానమే ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ పోస్టాఫీసు పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు రూ.17,000 వరకు స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం ఇచ్చే సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
Post Office Senior Citizen Savings Scheme

Updated on: Feb 22, 2026 | 1:17 PM

ఉద్యోగం చేసేటప్పుడు ఎంత సంపాదించామన్నది ఎంత ముఖ్యమో.. పదవీ విరమణ తర్వాత ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టామన్నది కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక నకిలీ పథకాలు ఇన్వెస్టర్లను ఊరిస్తుండటంతో సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక సందిగ్ధంలో పడుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన పథకమే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ పథకం ద్వారా నెలకు వేలల్లో వడ్డీని ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఆకర్షణీయమైన వడ్డీ రేటు

ప్రస్తుతం పోస్టాఫీసు ద్వారా అందుబాటులో ఉన్న ఈ పథకంపై ప్రభుత్వం 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఇది మెరుగైన లాభాలను ఇస్తోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారు రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం.

నెలకు రూ.17,000 ఆదాయం ఎలా సాధ్యం?

ఈ పథకంలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ మీరు రూ.25 లక్షలను ఈ పథకంలో డిపాజిట్ చేస్తే..8.2శాతం ప్రకారం సంవత్సరానికి రూ.2,05,000 వడ్డీ లభిస్తుంది.
దీనిని నెలవారీగా లెక్కిస్తే.. మీకు సుమారు రూ.17,000 పైగా వడ్డీ రూపంలో ఆదాయం అందుతుంది.

ఐదేళ్లలో భారీ మొత్తం..

SCSS పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. మీరు రూ.25 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత మీకు లభించే మొత్తం ఇలా ఉంటుంది..

  • మొత్తం వడ్డీ: రూ.10,25,000
  • మెచ్యూరిటీ తర్వాత: అసలు + వడ్డీ కలిపి రూ.35,25,000 మీ సొంతమవుతుంది.

 

పథకం ముఖ్య ఉద్దేశ్యం

పదవీ విరమణ చేసిన వ్యక్తులు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి ఈ పథకం తీసుకొచ్చారు. ఇందులో వడ్డీని త్రైమాసికానికి ఒకసారి క్లెయిమ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

Follow Us