Post Office Schemes: పోస్టల్‌ శాఖ అందించే ముఖ్య పథకాలు.. ఏ స్కీమ్‌లో ఎంత రాబడి.. ఎంత వడ్డీ రేటు..!

|

Aug 30, 2021 | 11:48 AM

Post Office Schemes: పోస్టాఫీసుల్లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పోస్టుకార్డులకే పరిమితమైన పోస్టల్ శాఖ.. ఇప్పుడు బ్యాంకుల్లో..

Post Office Schemes: పోస్టల్‌ శాఖ అందించే ముఖ్య పథకాలు.. ఏ స్కీమ్‌లో ఎంత రాబడి.. ఎంత వడ్డీ రేటు..!
Follow us on

Post Office Schemes: పోస్టాఫీసుల్లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పోస్టుకార్డులకే పరిమితమైన పోస్టల్ శాఖ.. ఇప్పుడు బ్యాంకుల్లో ఉండే స్కీమ్స్‌లాగే అన్ని పథకాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పోస్టల్‌ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు రకరకాల స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇక సురక్షితమైన పెట్టుబడి విషయానికొస్తే.. పోస్టాఫీసులో మెరుగైన పథకాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ రాబడిని అందిస్తోంది పోస్టల్‌ శాఖ. అయితే ఏ పథకంలో మీ డబ్బులకు ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతాయో చూద్దాం.

పోస్ట్‌ ఆఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌:

ఈ స్కీమ్‌లో 1 నుంచి 3 సంవత్సరాల టైమ్‌ డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతని డబ్బు రెట్టింపు అవుతుంది. ఇదే సమయంలో పోస్ట్‌ ఆఫీసు 5 సంవత్సరాల టైమ్‌ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

సుకన్య సమృద్ది యోజన పథకం:

సుకన్ సమృద్ది యోచన.. ఈ పథకం మొదటి నుంచే చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ పథకం కింద ఇప్పుడు 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ స్కీమ్‌లో ఎవరైనా డబ్బులు పెడితే 9 సంవత్సరాల 6 నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయి.

రికరింగ్‌ డిపాజిట్‌:

ప్రస్తుతం పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ (RD) ఈ స్కీమ్‌లో డబ్బులపై 5.8 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు 12 సంవత్సరాల 5 నెలల్లో రెట్టింపు అవుతుంది.

పోస్ట్‌ ఆఫీస్‌ సీనియర్‌ సిటిజన్ స్కీమ్‌:

ప్రస్తుతం పోస్ట్‌ ఆఫీస్‌ సీనియర్‌ సిటిజన్ స్కీమ్‌లో పెట్టిన డబ్బులపై 7.4 వడ్డీ రేటు అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్స్‌ ఈ పథకంలో డబ్బులు పెట్టుబడి పెడితే వారి డబ్బు 9 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది.

పోస్ట్‌ ఆఫీస్‌ నెలవారీ ఆదాయం పథకం:

ప్రస్తుతం పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథంలో చేరినట్లయితే 6.6 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది.11 సంవత్సరాల్లో మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది.

పీపీఎఫ్‌ పథకం:

పీపీఎఫ్‌ అంటే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకానికి ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు ఈ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడిని పరిశీలిస్తే.. 10 సంవత్సరాల 4 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు రెట్టింపు అవుతాయి.

కిసాన్‌ వికాస్‌ పాత్ర:

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కూడా మంచి రాబడులు వస్తాయి. దీనిపై వడ్డీ రేటు ప్రస్తుతం 6.9 శాతంగా నిర్ణయించబడింది. దీని ప్రకారం.. మీ డబ్బు ఇక్కడ 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేనప్పటికీ మీరు కనీసం రూ.1000 పెట్టుబడితో ఇందులో చేరవచ్చు

నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్‌:

కిసాన్ వికాస్‌ పత్రాలాగానే పోస్టాఫీసు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా మంచి రాబడి పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి 6.8 శాతం వడ్డీ అందిస్తోంది. దీని ప్రకారం.. మీ డబ్బు సుమారు 10 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది.
కాగా, ఇందులో ఏ స్కీమ్‌లో కాలపరిమితి ఏమిటి..? మీరు పెట్టిన పెట్టుబడిపై ఎంత శాతం వడ్డీ రేటు వస్తుందనే విషయాలను అందిస్తున్నాము. పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Cheque Rule: మీరు చెక్‌బుక్‌ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. నిబంధనలు మారాయి.. లేకపోతే ఇబ్బందులే..

Fixed Deposit Interest Rates: మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? అధిక వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే

NPS Rules Changed: కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. నిబంధనలు మార్పు..!