Post Office Scheme: పోస్టాఫీసులో పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసే స్కీమ్‌ గురించి తెలుసా?

|

Dec 23, 2022 | 9:59 AM

వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా మంచి రాబడిని కూడా పొందవచ్చు. ఎలాంటి రిస్క్‌ లేకుండా ఖచ్చితంగా మంచి రాబడి వచ్చే..

Post Office Scheme: పోస్టాఫీసులో పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసే స్కీమ్‌ గురించి తెలుసా?
Post Office Scheme
Follow us on

వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా మంచి రాబడిని కూడా పొందవచ్చు. ఎలాంటి రిస్క్‌ లేకుండా ఖచ్చితంగా మంచి రాబడి వచ్చే పథకాలను ఎంచుకోవడం వల్ల మీరు ధనవంతులు కావచ్చు. మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ 124 నెలల్లో రెట్టింపు అయ్యే పథకం ఉంది. దీని వల్ల మంచి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం దక్కించుకోవచ్చు. ఈ పథకం పేరే కిసాన్‌ వికాస్‌ పత్ర. ఇందులో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టి డబుల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో మీ డబ్బుకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ 10 సంవత్సరాల 4 నెలల్లో (124 నెలలు) రెట్టింపు అవుతుంది. మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు.

ఏ వయసు వారు అర్హులు:

ఈ పథకంలో చేరాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాంటి వారే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. రూ.1000, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.50 వేలు ఇలా మీకు నచ్చిన మొత్తంలో కిసాన్ వికాస్ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేట్ల విషయాలలో మూడు నెలలకోసారి మారుతూ ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అందువల్ల రేట్లలో మార్పు ఉండవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

సింగిల్‌, జాయింట్‌లో ఖాతా తీయవచ్చు:

ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటే సింగిల్‌, జాయింట్‌లో ఏదైనా ఖాతా తీయవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. పిల్లల పేరిట ఖాతా ఓపెన్‌ చేసి ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలాంటి పత్రాలు కావాలి?

ఈ స్కీమ్‌లో చేరాలంటే పోస్టాఫీసులో ఖాతా తీయవచ్చు.. దరఖాస్తుదారు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ఈ స్కీమ్‌లో నామినీ ఎంపిక కూడా ఉంటుంది.

డబ్బు ఎలా తీసుకోవాలి..?

మెచ్యూరిటీ మొత్తాన్ని పథకం గడువు పూర్తయిన తర్వాత ఏదైనా పోస్ట్‌ ఆఫీస్‌ నుంచి పొందవచ్చు. దీని కోసం లబ్దిదారుడు తన గుర్తింపు కార్డులతో పాటు, పథకానికి సంబంధించిన స్లిప్‌లు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్దిదారుడికి గుర్తింపు పత్రాలు లేకపోతే కిసాన్‌ వికాస్‌ పత్ర సర్టిఫికేట్‌ను తీసుకుని మీ పోస్టాఫీసు నుంచి మాత్రమే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి