Post Office Savings Plan: పోస్టాఫీస్‌ అందిస్తోన్న అదిరిపోయే పథకం.. చిన్న పెట్టుబడితో సురక్షిత రాబడి.. వివరాలివే..

|

Mar 15, 2022 | 4:47 PM

పోస్టాఫీస్(Post Office) అందించే పథకాల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC). దీంట్లో పెట్టుబడి పెడితే సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది..

Post Office Savings Plan: పోస్టాఫీస్‌ అందిస్తోన్న అదిరిపోయే పథకం.. చిన్న పెట్టుబడితో సురక్షిత రాబడి.. వివరాలివే..
Follow us on

పోస్టాఫీస్(Post Office) అందించే పథకాల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC). దీంట్లో పెట్టుబడి పెడితే సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఎన్‌ఎస్‌సిని సీనియర్ సిటిజన్‌లు కూడా ఏకరీతి నెలవారీ ఆదాయాన్ని పొందడానికి ఉపయోగించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. NSCలను మైనర్‌ కూడా ఈ పథకంలో చేరవచ్చు. అలాగే ఇద్దరు సంయుక్తంగా పథకంలో చేరవచ్చు.

వడ్డీ రేటు

NSC వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత త్రైమాసికంలో రేటు 6.8%. మీరు ఈరోజు 1000 రూపాయలకు ఈపథంలో పొదుపు చేస్తే మీ పెట్టుబడి ఐదేళ్లలో రూ.1389కి పెరుగుతుంది. ముఖ్యంగా, పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేనందున ఇందులో ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈరోజు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో మీ డబ్బు రూ.13.89 లక్షలకు చేరుకుంటుంది.

పన్ను ప్రయోజనం

ఇందులో రూ. 1.5 లక్షల పెట్టుబడి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే NSC మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ముందుగా తీసుకోవాలంటే కొన్ని సందర్భాల్లోనే అనుమతి ఉంటుంది.

  • డిపాజిటర్ మరణం
  • కోర్టు ఆదేశాలు

Read Also..  RBI: బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా.. నిబంధనలు పాటించని 8 బ్యాంకులపై జరిమానా విధింపు..!