Post Office: మీరు ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో మోసపోయారా..? టెన్షన్ వద్దు.. ఫిర్యాదు చేయండిలా..!

Post Office: బ్యాంకులు, ఇతర పెట్టుబడి సంస్థల్లో అప్పుడప్పుడు మోసాలు జరుగుతుంటాయి. పెట్టిన పెట్టుబడుల్లో డబ్బులు మాయం కావడం, ఇంకేదైన మోసం జరుగుతుంటుంది...

Post Office: మీరు ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో మోసపోయారా..? టెన్షన్ వద్దు.. ఫిర్యాదు చేయండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 08, 2021 | 7:45 AM

Post Office: బ్యాంకులు, ఇతర పెట్టుబడి సంస్థల్లో అప్పుడప్పుడు మోసాలు జరుగుతుంటాయి. పెట్టిన పెట్టుబడుల్లో డబ్బులు మాయం కావడం, ఇంకేదైన మోసం జరుగుతుంటుంది. ఇక పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల పథకాలు అంబాటులో ఉన్నాయి. పలు రకాల స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడం, సేవింగ్‌ స్కీమ్‌లో చేరడం లాంటివి చేస్తుంటారు చాలా మంది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఏదైనా మోసం జరిగినట్లయితే ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయం తెలియదు. ఫిర్యాదు చేసిన తర్వాత సమస్య పరిష్కారం కావాలంటే కొన్ని రోజులు సంస్థల చుట్టు తిరగాల్సి ఉంటుంది. ఇక పోస్టాఫీసులలో ఉన్న పలు స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టిన తర్వాత అనేక రకమైన మోసాలు జరిగే అవకాశాలుంటాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఇటీవల స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసిజర్‌ (ఎస్‌ఓపీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్టల్‌ శాఖలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వ్యక్తికి మోసం జరిగినా.. ఏవైనా అవకతవకలు జరిగినా అందుకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు. మోసపోయిన వ్యక్తి పోస్టాఫీసు బ్రాంచ్‌ లేదా ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి మోసానికి గురైన డబ్బులను తిరిగి చెల్లిస్తారు. అయితే మోసం కేసు వెలుగులోకి వచ్చిన మూడు రోజుల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో జరిగిన మోసాలను నివేదించేందుకు కాలపరిమితి ఏమి లేదు. అలాగే మోసాన్ని నివేదించే ఏ హక్కుదారునికి లేదా వ్యక్తికి ఏ స్థాయిలో అసౌకర్యం ఉండకూదనే విషయం జారీ చేసిన సర్క్యూలర్‌లో పొందుపర్చారు. ఫారం నింపిన మొదలు బాధితునికి పరిష్కారం అయ్యే వరకు అన్ని రకాల సహాయం అందుతుంది.

పోస్టాఫీసులో ఎలా ఫిర్యాదు చేయాలి..? పోస్టాల్‌ విభాగంలో ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు ఓ ఫారమ్‌ ఉంటుంది. అందులో మోసం లేదా లావాదేవీల విషయంలో జరిగిన అవకతవకలు, పోస్టల్‌ శాఖలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కోల్పోయినట్లయితే తదితర అంశలపై ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేసే ఫారమ్‌లో పూర్తి వివరాలు వెల్లడించాలి. ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో కూడా క్లుప్తంగా వివరించాలి.

ఫారంతో పాటు ఫిర్యాదు చేసే వ్యక్తి ఫోటో గుర్తింపు కార్డు, చిరునామాకు సంబంధించిన ఫ్రూప్‌, పాన్‌ కార్డు, ఆధార్‌, ఏదైనా గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది. అంతేకాదు పాస్‌బుక్‌, డిపాజిట్‌ చేసిన రశీదు జిరాక్స్‌ను సైతం జాత చేయాలి. ఎవరైనా ఇ-మెయిల్‌ ద్వారా రిపోర్టు చేస్తే లేదా ఫారమ్‌ నింపినట్లయితే సరైన ఇ-మెయిన్‌ ఐడి, మొబైల్‌ నెంబర్‌, చిరునామా జత చేసి ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు మీ ఫిర్యాదును స్వీకరించిన పోస్టల్‌ అధికారులు విచారణ చేపడతారు.

ఫిర్యాదును అంగీకరించిన తర్వాత ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కేటాయిస్తారు. మీకు జరిగిన మోసాన్ని ధృవీకరించి మీ మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు. అలాగే ఏదైనా ఫోరెన్సిక్‌ పరీక్షలు అవసరమైతే కాస్త ఆలస్యం అవుతుంది. 90 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ స్కీమ్‌లో ఎలాంటి అవకతవకలు జరిగినా.. డబ్బులు మోసానికి గురైనా టెన్షన్‌ పడవద్దని, పూర్తి మొత్తం మీ ఖాతాల్లో జమ చేయబడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

SBI Customers Alert: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. మీరు పొరపాటున ఇలా చేసినట్లయితే మోసపోవాల్సిందే..

Credit Card Mistakes: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా