Saving Schemes: డబ్బులే.. డబ్బులు.. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు రూ.82 వేల లాభం..

Post Office Saving Schemes: ఇందులో ఒకేసారి లంప్‌ సమ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేయాలి. లంప్‌సమ్ అమౌంట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే డబ్బు. ఇది సాధారణంగా ఒకేసారి పెట్టుబడి పెట్టే మొత్తాన్ని సూచిస్తుంది. సంవత్సరానికి 8.2% వడ్డీ రేటు..

Saving Schemes: డబ్బులే.. డబ్బులు.. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు రూ.82 వేల లాభం..

Updated on: Jul 09, 2025 | 5:12 PM

ప్రతినెలా పొందే వేతం పొందే ఉద్యోగులు ప్రతి నెల కొంత డబ్బు ఆదా చేస్తే ఎన్నో అవసరాలు తీరుతాయి. అలాగే డబ్బును కూడబెట్టుకునేందుకు రకరకాల ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటారు. కొందరు SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మరికొందరు మంచి రిటర్న్స్‌ అందించే సేఫ్‌ ఆప్షన్స్‌ కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారికి పోస్టాఫీస్‌ ద్వారా ప్రభుత్వం అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అద్భుతమైన ఆప్షన్‌ అనే చెప్పాలి. ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ పెట్టుబడికి గ్యారంటి ఇచ్చే స్కీమ్‌లు ఉంటాయి. ఐదేళ్ల పాటు ఈ పథకంలో పెట్టుబడి పెడితే, రూ.82,000 కంటే ఎక్కువ వడ్డీ సంపాదించవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేక పథకం. ఇందులో ఒకేసారి లంప్‌ సమ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేయాలి. లంప్‌సమ్ అమౌంట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే డబ్బు. ఇది సాధారణంగా ఒకేసారి పెట్టుబడి పెట్టే మొత్తాన్ని సూచిస్తుంది. సంవత్సరానికి 8.2% వడ్డీ రేటు అందిస్తుంది. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. యాన్యువల్లీ కాలిక్యులేట్‌ చేస్తారు. ఇది స్థిరమైన ఇన్‌కమ్‌ సోర్స్‌గా మారుతుంది. ఇందులో ఇన్వెస్ట్‌ చేయాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసు వద్దకు వెళ్లి అకౌంట్‌ను తీసుకోవచ్చు. మీరు సింగిల్ లేదా పార్ట్‌నర్‌తో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

ఇవి కూడా చదవండి

ఈ పథకంలో మీరు 1000 రూపాయల నుంచి 30 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ పథకం 5 ఏళ్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌తో వస్తుంది. మీరు అవసరం అనుకుంటే ఈ పథకాన్ని మరో 3 ఏళ్ల పాటు పెంచుకోవచ్చు. సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ కూడా చేయవచ్చు.

ఈ పథకం ఎవరి కోసం..

ఈ పథకం ముఖ్యంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వారి కోసం రూపొందించారు. అయితే ఇతరులు కూడా కొన్ని షరతుల ప్రకారం ఇన్వెస్ట్‌ చేయవచ్చు. పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పదవీ విరమణ ప్రయోజనాలను పొందిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టవచ్చు. అలానే 50 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది పదవీ విరమణ ప్రయోజనాలను పొందిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇది కూడా చదవండి: iPhone 16: ఆపిల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్‌ 16

ఈ స్కీమ్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మీరు రూ.2,00,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఐదేళ్లలో 8.2% వడ్డీ రేటు ఆధారంగా ప్రతి మూడు నెలలకు రూ.4,099 వడ్డీగా పొందుతారు. 5 ఏళ్ల తర్వాత మొత్తం అందుకున్న వడ్డీ మాత్రమే రూ.82,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మీ మొత్తం అమౌంట్‌ రూ.2,82,000 (అసలు రూ.2,00,000 + వడ్డీ రూ.82,000). ఇక మీరు ఇన్వెస్ట్‌ చేసినదాన్ని బట్టి రాబడి ఉంటుందని గుర్తించుకోండి. ఎక్కువ చేస్తే ఎక్కువగానే వస్తాయి.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. కేవలం లక్ష పెట్టుబడితో రూ.1.5 కోట్ల రాబడి

ఇది కూడా చదవండి: Gold Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం