రూ. 2 కోట్ల కారు జస్ట్ రూ. 14 లక్షలకే.. సెకండ్ హ్యాండ్ కాదు.. వందశాతం సీల్ బండే కానీ చిన్న ట్విస్ట్..

|

Feb 02, 2023 | 5:30 PM

Automobile: వ్యాపారమేదైనా మార్కెటింగ్ తప్పనిసరి. మార్కెటింగ్ ద్వారా వ్యాపార సంస్థలు తమ ప్రోడక్ట్స్‌కి ప్రమోషన్ చేసుకుంటాయి. తద్వారా తమ ప్రోడక్ట్స్ సేల్స్ పెంచుకుంటాయి.

రూ. 2 కోట్ల కారు జస్ట్ రూ. 14 లక్షలకే.. సెకండ్ హ్యాండ్ కాదు.. వందశాతం సీల్ బండే కానీ చిన్న ట్విస్ట్..
Porsche 2023 Car
Follow us on

వ్యాపారమేదైనా మార్కెటింగ్ తప్పనిసరి. మార్కెటింగ్ ద్వారా వ్యాపార సంస్థలు తమ ప్రోడక్ట్స్‌కి ప్రమోషన్ చేసుకుంటాయి. తద్వారా తమ ప్రోడక్ట్స్ సేల్స్ పెంచుకుంటాయి. విలాసవంతమైన కార్ల విక్రయ సంస్థ పోర్షే కు ఈ మార్కెటింగే పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ఈ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్. చైనాలో ఎక్కువమంది ఈకార్లను ఇష్టపడుతారు. అయితే, చైనాలోని పోర్షే డీలర్ చేసిన ఒక ప్రకటన.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బిగ్ న్యూస్ అయ్యింది. సాధారణంగానే పోర్షే కారు ప్రారంభ ధర రూ. 148,000 డాలర్లు(భారత కరెన్సీలో రూ. 1.21 కోట్లు) ఉంటుంది. ఇంత భారీ విలువ చేసే పోర్షే స్పోర్ట్స్ కారును కేవలం 18,000 డాలర్లు(రూ. 14 లక్షలు)గా ప్రకటించింది. ఈ మేరకు భారీ ప్రకటన కూడా ఇచ్చింది. అదే ఇప్పుడు దానికి ఇబ్బందిగా మారింది.

ఉత్తర చైనా పట్టణంలోని యిన్‌చువాన్‌లోని పోర్షే డీలర్.. 2023 పనామెరా మోడల్‌ను ఆన్‌లైన్ ప్రకటనలో 124,000 యువాన్లకు ($18,000) లిస్ట్ చేశాడు. ఇది సెడాన్ వాస్తవ ప్రారంభ ధరలో ఎనిమిదో వంతు మాత్రమే. ఆ ప్రకటన చేసి కొందరు కస్టమర్లు.. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావించి.. వెంటనే డీలర్ వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందలాది మంది ఔత్సాహిక కొనుగోలుదారులు.. ఆన్‌లైన్‌లోనే బుకింగ్స్ చేశారు. 911 యువాన్‌లను ముందుగానే చెల్లించారు.

అయితే, ఇంత భారీ స్థాయిలో బుకింగ్స్ రావడంతో అనుమానం వ్యక్తం చేసిన పోర్షే కంపెనీ.. అసలు ఏం జరిగిందా? అనే విషయాన్ని ఆరా తీసింది. అప్పుడు తెలిసింది అసలు పొరపాటు. లిస్టెడ్ రిలైట్ ధరలో భారీ తప్పిదం జరిగిందని గుర్తించింది. వెంటనే జరిగిన పొరపాటకు క్షమాపణలు చెబుతూ.. మరో ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రకటనను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. బుకింగ్స్ చేసి, అడ్వాన్స్ చెల్లించిన వారందరికీ క్షమాపణలు చెప్పిన కంపెనీ.. 48 గంటల్లోగా ఆ అడ్వాన్స్ డబ్బును రీఫండ్ చేస్తామని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ పోర్షే డీలర్ చేసిన ఈ పొరపాటును నెటిజన్లు తమ ఆయుధంగా మార్చుకున్నారు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అంత ఖరీదైన కారును విక్రయానికి పెట్టినప్పుడు అన్నీ చూసుకోవాలి కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..