PMVVY: వారికి అలర్ట్‌.. మార్చి 31తో గడువు ముగియనుంది.. ఇదే చివరి అవకాశం

|

Mar 24, 2023 | 3:53 PM

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రారంభిస్తూనే ఉంది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒకటి. ఇది పెన్షన్ స్కీమ్. దీని కింద పెట్టుబడిదారులు ప్రతి నెల హామీతో కూడిన రాబడి భద్రతను..

PMVVY: వారికి అలర్ట్‌.. మార్చి 31తో గడువు ముగియనుంది.. ఇదే చివరి అవకాశం
PMVVY
Follow us on

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రారంభిస్తూనే ఉంది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒకటి. ఇది పెన్షన్ స్కీమ్. దీని కింద పెట్టుబడిదారులు ప్రతి నెల హామీతో కూడిన రాబడి భద్రతను పొందుతారు. ఈ పథకం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేయబడుతోంది. మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీకు మార్చి 31 వరకు మాత్రమే సమయం ఉంది. వాస్తవానికి, ఈ పథకం గడువును పొడిగించేందుకు ఎల్‌ఐసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి పరిస్థితిలో ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

వయ వందన యోజన అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒక సామాజిక భద్రతా పథకం. దీని కింద దరఖాస్తుదారునికి వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిబంధన ఉంది. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) నిర్వహిస్తుంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో అర్హులు. ఈ పథకం కింద వారు గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పథకంలో కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమే ఉండేది. తర్వాత ఈ మొత్తాన్ని డబుల్‌ చేసింది కేంద్రం. ఈ ప్లాన్‌పై సీనియర్ సిటిజన్‌లు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

పెట్టుబడిని బట్టి పెన్షన్ ప్రయోజనం:

ప్రధాన మంత్రి వయ వందన యోజన అత్యంత ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇందులో మీరు ప్రతి నెలా కనీస పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. పెన్షన్ మొత్తం పెట్టుబడి మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద రూ.1,000 నుంచి రూ.9,9,250 వరకు పెన్షన్ పొందవచ్చు. మరోవైపు భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారు రూ.18,300 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పథకంలో పెట్టుబడి పరిమితి రూ. 1.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలవారీగా రూ.1,000 పెన్షన్ వస్తుంది. అదే సమయంలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 9,250 పెన్షన్ మొత్తం అందుతుంది. మరోవైపు భార్య, భార్య ఇద్దరూ కలిసి పెట్టుబడి పెడితే మొత్తం రూ.30 లక్షల పెట్టుబడి ద్వారా నెలవారీ రూ.18,300 పెన్షన్ పొందవచ్చు. మీరు ఈ పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా పొందుతారు. ఈ పథకంలో మొత్తం 10 సంవత్సరాల పాటు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.

మార్చి 31, 2023 తర్వాత పెట్టుబడి పెట్టలేరు:

ఈ పథకం గడువు మార్చి 31, 2023తో ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చివరి అవకాశం. ఎల్‌ఐసీ ఈ అద్భుతమైన పాలసీ ఏప్రిల్ 1 నుంచి మూసివేయబడుతుంది. దీన్ని ఎల్‌ఐసీ మే 4, 2017న ప్రారంభించింది.

పథకంలో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు:

మీరు ప్రధాన్ మంత్రి వయ వందన యోజనలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఏదైనా ఎల్‌ఐసీ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టడం కూడా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. పథకం మెచ్యూరిటీకి ముందు ఒక వ్యక్తి మరణిస్తే, ఆ పెట్టుబడిదారుడి డబ్బు నామినీకి అందజేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి