PM Awas Yojana: ఇల్లు కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. రూ.2.5 లక్షలు ఉచితంగా పొందొచ్చు.. ఎలా అంటే..?
నగరాల్లో నివసించే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు నిర్మించుకోవడం అనేది భారంతో కూడుకున్న పని. దీంతో వీరి సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్రం పీఎం ఆవాస్ అర్బన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కేేేంద్రం నుంచి సాయం పొందవచ్చు.

సిటీలో ఇల్లు కొనాలన్నా లేదా నిర్మించుకోవాలన్నా రూ.లక్షలు, రూ.కోట్లలో ఖర్చు అవుతుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భారంగా చెప్పవచ్చు. దీంతో ఇలాంటివారికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. నగరాల్లో ఇల్లు కట్టుకుంటున్నా లేదా కొనుగోలు చేస్తున్నా మీరు ఈ సాయం పొందవచ్చు. అంతేకాదు బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందవచ్చు. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రూ. 2.5 లక్షల వరకు సాయం పొందవచ్చు. అలాగే హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రాయితీని కూడా కేంద్రం కల్పిస్తోంది.
ఇల్లు కట్టుకుంటే ఎంత సాయం వస్తుంది..?
బలహీన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలు సొంత భూమి 45 చదరపు మీటర్ల వరకు కలిగి ఉండాలి. ఈ ఇంటికి రూ.2.5 లక్షల సాయం అందిస్తారు. ఇక ఇల్లు కొనుగులు చేయాలన్నా ఇదే మొత్తంలో లబ్దిదారుడికి అందుతుంది.
హోమ్ లోన్ తీసుకున్నా వడ్డీ రాయితీ..
ఇక ఇల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు హోమ్ లోన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తోంది.సెప్టెంబర్ 1, 2024న లేదా ఆ తర్వాత ఆమోదించబడిన హోమ్ లోన్లకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. ఈ సౌకర్యం EWS, LIG, MIG వర్గాలలోని అర్హులైన కుటుంబాలకు వర్తిస్తుంది. గృహ రుణ వడ్డీ రాయితీ గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు లభిస్తుంది.
అర్హులు ఎవరంటే..?
-ఆర్థికంగా వెనుకబడిన, మధ్య ఆదాయ వర్గాలకు చెందిన పట్టణ కుటుంబాల ప్రజలు అర్హులు
-EWS కేటగిరీ ప్రజలు వార్షిక ఆదాయం రూ. 3 లక్షల్లోపు ఉండాలి
-LIG కేటగిరీ వర్గాల వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి రూ. 6 లక్షల మధ్య ఉండాలి
MIG కేటగిరీ కింద వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుండి రూ. 9 లక్షల మధ్య ఉండాలి
-దరఖాస్తుదారునికి లేదా అతని కుటుంబానికి దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు
-వితంతువులు, అవివాహిత మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, షెడ్యూల్డ్ కులాలు-తెగలు, మైనారిటీ వర్గాలు,ఇతర బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..
ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, బిఎల్‌సి కేటగిరీకి సంబంధించిన భూమి పత్రాలు
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
PMAY-U 2.0 కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించారు. ముందుగా అర్హత ఉందా.. లేదా అనేది చెక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ ధృవీకరణను పూర్తి చేసి లబ్ధిదారుల సర్వే ఫారమ్ నింపాలి. వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, గృహ సమాచారం, గృహ రుణ వివరాలను సమర్పించాలి.
