PMAY: సొంతింటి కల.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్‏లైన్‏లో ఇలా అప్లై చేసుకోండి..

|

Apr 08, 2022 | 6:33 PM

Pradhan Mantri Awas Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల పథకాలలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఒకటి.

PMAY: సొంతింటి కల.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్‏లైన్‏లో ఇలా అప్లై చేసుకోండి..
Pmay
Follow us on

Pradhan Mantri Awas Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల పథకాలలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఒకటి. దీనిని 2015 జూన్ 25న మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దాదాపు 1.12 గృహాలను నిర్మించడం కోసం అర్హత కలిగిన కుటుంబాలు, లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు ద్వారా అమలు చేసే ఏజెన్సీలకు మిషన్ కేంద్ర సహాయన్ని అందిస్తుంది. ఈ పథకం ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, పట్టణ, గ్రామీణ పేదల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టారు. ముందు ఉన్న పథకాల మాదిరిగా కాకుండా.. EWS, LIG నుంచి మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల కొనసాగింపుగా PMAY (U) ఈ మిషన్ కింద ఇంటి యాజమాని లేదా సహయజమానిగా కుటుంబపెద్దలకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా.. ఈ స్కీమ్ అనేది.. బలహీనమైన.. తక్కువ ఆదాయ, మధ్య ఆదాయ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు గృహా రుణాలపై వడ్డీ రాయితీలను అందిస్తుంది.  గ్రామీణ, పట్టణాలలో ఉన్న జనాభాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని, PMAY (U) PMAY (G) అని రెండు విభాగాలుగా విడదీశారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం అప్లై చేయడానికి అవసరమైన సర్టిఫికేట్స్..

* ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్.

* చిరునామా నిరూపణ..

* ఆదాయ రుజువు కార్డ్. (బ్యాంక్ ఖాతా స్టేట్ మెంట్, ఐటీ రిటర్న్స్)

నియమాలు..

* ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS): మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.

* దిగువ ఆదాయ సమూహం (LIG): వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల నుండి రూ. 6 లక్షలు.

* మధ్య ఆదాయ సమూహం (MIGలు): వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల నుండి రూ. 18 లక్షలు.
మురికి వాడలలో నివసించేవారు.

ఎలా అప్లై చేయాలంటే..

* PMAYకి అర్హత పొందిన వర్గాన్ని గుర్తించాలి.

* అధికారిక వెబ్‌సైట్‌ లాగిన్ కావాలి.

* ప్రధాన మెనూ కింద ఉన్న ‘సిటిజన్ అసెస్‌మెంట్’పై క్లిక్ చేసి, దరఖాస్తుదారు వర్గాన్ని ఎంచుకోవాలి.

* ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి.

* వ్యక్తిగత, ఆదాయం, బ్యాంక్ ఖాతా వివరాలు, ప్రస్తుత నివాస చిరునామాతో ఆన్‌లైన్ PMAY అప్లికేషన్‌ను పూర్తిచేయాలి.

* క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. సరైన వివరాలను ధృవీకరించండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి:
రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో ఒక ఫారమ్‌ను పూరించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి ఏ ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలు డబ్బును సేకరించడానికి అనుమతించబడదని గమనించాలి.

మీరు ఏదైనా బ్యాంక్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని కూడా సందర్శించవచ్చు, పథకం దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి.

మీరు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఫారమ్‌లో చూపించిన పత్రాలను సమర్పించాలి, మీ అర్హతను తనిఖీ చేయాలి.

గమనిక: – ‘సిటిజన్ అసెస్‌మెంట్’ కింద ‘ట్రాక్ యువర్ అసెస్‌మెంట్ స్టేటస్’పై క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ స్థితిని తర్వాత ట్రాక్ చేయవచ్చు.

Also Read: Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..

Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..

Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..