ఎందరో యువ వ్యాపారవేత్తల వేదిక ‘ప్రారంభ్’.. స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

|

Jan 16, 2021 | 3:09 PM

స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రం (శనివారం) 5గంటలకు ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడనున్నారు. 'ప్రారంభ్'​ పేరిట..

ఎందరో యువ వ్యాపారవేత్తల వేదిక ప్రారంభ్.. స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Follow us on

Prarambh Startup India : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రం (శనివారం) 5గంటలకు ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడనున్నారు. ‘ప్రారంభ్’​ పేరిట ఈ సదస్సును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ నిర్వహిస్తోంది.

2018 ఆగస్టులో కాఠ్మాండులో నిర్వహించిన బిమ్​స్టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, ఈ కార్యక్రమాన్ని భారత్​లో నిర్వహిస్తామని అప్పుడే ప్రకటించారు. దేశం​లో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు 2016 జనవరి 16న ‘సార్టప్​ ఇండియా’కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. దీని ఐదో వార్షికోత్సవం సందర్భంగా స్టార్టప్​ ఇండియా అంతర్జాతీయ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది.

ఈ సదస్సులో 25 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, 200మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్నారు. వీరినుద్దేశించి శనివారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తారు.

ఇవి కూడా చదవండి :

Dinesh Karthik Trolled: రోహిత్‌ శర్మను సరదాగా ట్రోల్ చేసిన ఇండియన్ వెటరన్ క్రికెటర్.. ఏమని చేశాడంటే..
Corona Vaccine Launch LIVE: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ షురూ, మహాకవి గురజాడ అప్పారావు మాటలు వల్లెవేసిన ప్రధాని మోదీ