రైతులతో సహా సమాజంలోని పెద్ద వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం కింద, అర్హులైన రైతులు సంవత్సరానికి మూడుసార్లు రూ.2,000 పొందుతారు. మీరు ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకం కింద అందించే 19వ విడతకు అర్హులు కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు 18వ విడత అందుకోగా, ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది. మీరు తదుపరి చెల్లింపును అందుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి.
రైతులు ఇవి తప్పనిసరి చేయాల్సిందే?
మీరు పీఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకున్నట్లయితే రైతులు తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాలి.
వీరికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు:
ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ చెల్లింపుదారులు, వృత్తి నిపుణుల వంటి వారికి పీఎం కిసాన్ సాయం అందదని గుర్తించుకోండి. అనర్హులైన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిగిస్తోంది. కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పీఎం కిసాన్ యోజన బెనిఫిట్ లభిస్తుంది. ఒక వేళ భార్యాభర్తలిద్దరిపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి