PM Kisan Yojana: రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2000చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. 2021 డిసెంబర్ 15 నాటికి తదుపరి విడత రూ.2000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశ వ్యాప్తంగా రైతులకు ఇవ్వబడిన రూ.2000లను రైతు బ్యాంకు ఖాతాల్లోకి తొమ్మిది విడతలుగా బదిలీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి ఏడాది రూ.6000 చొప్పున మూడు విడతలుగా రూ.2000 అందజేస్తోంది. రైతులు ఇప్పుడు 10వ విడత 2022లో వేయనుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఉదాహరణకు రైతుల భవిష్యత్తుకు భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పీఎం శ్రమ యోగి మంధన్ యోజనను కూడా అమలు చేస్తోంది. దీని ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు.
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కింద రైతులు ప్రతి నెల కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీ పెన్షన్ పొందవచ్చు. రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేని సమయంలో ఈ డబ్బు చేతికి అందుతుంది. ఈ పథకంలో చేరిన రైతులకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలవారీ పెన్షన్ ప్రారంభం అవుతుంది.
ఎంత పెన్షన్ వస్తుంది..?
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కోసం దరఖాస్తు చేసుకునే రైతులు వివిధ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారులు పథకం కోసం ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న ఏ రైతు అయినా వృద్ధాప్యంలో ఖర్చుల కోసం ప్రతి నెల రూ.3000 పెన్షన్ పొందవచ్చు.
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు:
1. ఆధార్ కార్డు
2. వయసు పర్టిఫికేట్
3. ఆదాయ ధృవీకరణ
4. బ్యాంకు ఖాతా పాస్‌బుక్
5. మొబైల్ నంబర్
6. పాస్‌పోర్టు సైజు ఫోటో
నెలకు రూ.3000 పొందడానికి రైతులు వారి ప్రస్తుతం వయసు బట్టి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ఈ స్కీమ్‌లో జమ చేయాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి కూడా ఈ బీమా పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
మాన్‌ధన్ యోజన అంటే ఏమిటి..?
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన కింద దేశంలో చిన్న, సన్నకారు రైతులందరు ఈ బీమా ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్ కింద రైతులు వృద్ధాప్యంలో సరైన జీవనం సాగించేందుకు ప్రభుత్వం పింఛన్ అందజేస్తుంది. రైతులు రూ.3000 పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ 2019లో ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రూ.3000 పెన్షన్ సహాయంగా అందుతుంది.
ఇవి కూడా చదవండి: