రైతులకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని చాలా మంది రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా రైతులు 13వ విడత వరకు డబ్బులు అందుకోగా, ఇప్పుడు 14వ విడత విడుదల కానుంది. నివేదికల ప్రకారం మే చివరి వారంలో అర్హులైన లబ్ధిదారులకు రూ .2,000 విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కొన్ని మీడియా నివేదికల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ నివేదించింది. ఫిబ్రవరిలో కేంద్రం 13వ విడత నిధులు విడుదల చేసింది. బెల్గామ్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 13విడత సొమ్ము విడుదలైన విషయాన్ని ఆయన ప్రకటించారు . ఇప్పుడు 14వ భాగం విడుదలకు సమయం ఆసన్నమైంది .
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019 లో ప్రారంభమైంది . వ్యవసాయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. సంవత్సరానికి ఒకసారి చెల్లించే బదులు 3 వాయిదాలలో నిధులు అందిస్తోంది కేంద్రం. అంటే ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి మూడు విడతలుగా రూ .2000 జమ చేస్తుంది. కర్నాటక రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వాయిదాలు జత చేస్తుంది. అంటే రాష్ట్ర రైతులకు ఏడాదికి రూ .10,000 అందుతుంది .
PM కిసాన్ పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకుంటే లేదా మీరు మొదటి సారి పథకంలో నమోదు చేసుకుంటే ఇది ఆన్‌లైన్‌లో చేయవచ్చు .
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి