PM Kisan: చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతోంది. ఒక వైపు వేలాది మంది లబ్దిదారులు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతుంటే కొందకు ఎలాంటి లబ్ది పొందడం లేదు. బీహార్‌లోని సీమాంచల్ సర్కిల్ పరిధిలో జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం అందడం లేదు. మరో వైపు ఆదాయాన్ని పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేవారు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజమైన లబ్దిదారులకు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు విచారణ చేపట్టారు. ఇలా అనర్హులుగా ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ము రివకరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా నకిలీ రైతులకు పథకం ప్రయోజనాలు అందడం సంచలనంగా మారింది.
జిల్లాలో అనర్హులు 841 మందిని గుర్తింపు:
కాగా, సహర్సా జిల్లాలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 38 వేల 811 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, సాంకేతిక కారణాల వల్ల చాలా దరఖాస్తులు అమలు కాలేదు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఇటువంటి రైతుల దరఖాస్తులను ఫార్వడ్ చేయలేదు. అలాగే వారి పేరు మీద అద్దె రశీదు లేదు. అయినప్పటికీ జిల్లాలోని 2 లక్షల 84 వేల 151 మంది రైతులు ఈ పథకాన్ని పొందుతున్నారు. ఇందులో ఆదాయపు పన్ను దాఖలు చేసే 841 మంది అనర్హులను ఆ శాఖ గుర్తించింది.
గత సంవత్సరం అటువంటి లబ్దిదారుల నుంచి మొత్తాన్ని తిరిగి పొందాలని అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. దీనిపై విచారణ జరిపించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరుతున్నారు నిజమైన లబ్దిదారులు. దీనికి సంబంధించిన మొదట్లో ఆ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీని కారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే లబ్దిదారులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందారు. తర్వాత అటువంటి లబ్దిదారులకు సంబంధించిన ఆర్డర్ రాగానే ఆ వ్యక్తుల గుర్తింపు, మొత్తాన్ని వాపసు తీసుకోవడం లాంటి చర్యలు ప్రారంభించారు అధికారులు.
ఇవి కూడా చదవండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. ఈ ఖాతా తెరిస్తే ప్రతి నెలా రూ.5 వేలు పొందవచ్చు