PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?

|

May 02, 2022 | 4:41 PM

PM KISAN Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను..

PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?
Follow us on

PM KISAN Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తోంది. కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన స్కీమ్‌లలో పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులు ప్రతి ఏడాది రూ. 6 వేల చొప్పున అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏడాదికి మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇక మోడీ ప్రభుత్వం రైతులకు 11వ విడత డబ్బులు అందించనుంది. ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురు చూస్తున్నారు రైతులు.

పీఎం కిసాన్‌కు సంబంధించి 11వ విడత డబ్బులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000 జమ కానున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నాహాలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ 11వ విడత డబ్బులు మే నెల రెండోవారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. రైతులు అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత డబ్బులు వచ్చాయా.? లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం.

ఇలా చెక్ చేసుకోండి..

☛ ముందుగా అధికారిక వెబ్‏సైట్ ను ఓపెన్ చేయాలి.

☛ హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత బెనిఫిసరి లీస్ట్ పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా/ సబ్ జిల్లా, ఊరు వివరాలను సెలక్ట్ చేసుకోవాలి.

☛ అనంతరం రీపోర్ట్ గెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☛ పేజీపై కనిపించే లభ్దిదారుల జాబితాపై క్లిక్ చేయాలి.

☛ అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

☛ ఆ తర్వాత pmksny హోమ్ పేజీకి తిరిగి వెళ్లాలి.

☛ మరోసారి బెనిఫిసరి స్టేటస్ పై క్లిక్చేయాలి.

☛ మీ ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్, అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.

☛ గెట్ డేట్ బటన్ పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీ ఇన్‏స్టాల్‏మెంట్ పేమెంట్ చెక్ చేసుకోవాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Heat Stroke: హీట్‌స్ట్రోక్ శరీరంలో ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది.. లక్షణాలు ఏమిటి?

Tomato Prices: భారీగా పెరిగిన టామోట ధరలు.. లాబోదిబోమంటున్న ప్రజలు