Telugu News Business PM KISAN Samman Nidhi Yojana: How to apply PM Kisan Samman Nidhi online?
PM Kisan: రైతులు పీఎం కిసాన్ సాయం పొందడం ఎలా? దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
PM Kisan: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. అయితే ఇప్పటి వరకు 17వ విడత డబ్బులు అందుకున్న రైతులు.. 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు..
PM Kisan: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. అయితే ఇప్పటి వరకు 17వ విడత డబ్బులు అందుకున్న రైతులు.. 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది కేంద్రం. ఈ డబ్బులు ఒకే సారి కాకుండా విడత వారిగా అంటే మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.
తక్కువ భూమి కలిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించారు ప్రధాని మోడీ. కొత్త రైతులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం.