PM KISAN Samman Nidhi Yojana: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌లో పేరు నమోదు చేసుకోవడం ఎలా..?

|

Jan 19, 2022 | 11:00 AM

PM KISAN Samman Nidhi Yojana: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది...

PM KISAN Samman Nidhi Yojana: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌లో పేరు నమోదు చేసుకోవడం ఎలా..?
Follow us on

PM KISAN Samman Nidhi Yojana: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం (PM kisna yojana) ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు కోన్నికోట్లాది రూపాయలు విడుదల చేసింది. జనవరి 1, 2022న పీఎం కిసాన్‌ యోజన 10వ విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డబ్బులను విడుదల చేశారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అంఉదకుంటారు. రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు.

తక్కువ భూమి కలిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించబడింది. ఇంతకుముందు ఈ పథకం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ తరువాత, పిఎం కిసాన్ యోజన అన్ని చిన్న భూస్వామ్య కుటుంబాలకు అందించేలా చర్యలు తీసుకుంద కేంద్ర ప్రభుత్వం. జనవరి 1, 2022న రూ. 14 కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్రం. దీనివల్ల 1.24 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. PM కిసాన్ డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాన్ని అధికారిక పోర్టల్ www.pmkisan.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు.

ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..

* ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి.

* ఆ తర్వాత FARMER CORNERS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత మరో న్యూ విండో ఓపెన్ అవుతుంది.

* అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా పూర్తి చేయాలి.

* ఆ తర్వాత బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పూరించేప్పుడు.. , IFSC కోడ్‌ను సరిగ్గా నింపి దాన్ని సేవ్ చేయాలి.

* ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ భూమి వివరాలు ఎంటర్ చేయాలి.

* అందులో ఖాస్రా నంబర్, ఖాతా నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి.

* ఇప్పుడు మీ రిజిస్టర్ ప్రక్రియ పూర్తవుతుంది.

PM కిసాన్ అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు

► భూమి యొక్క అసలు పత్రాలు

► దరఖాస్తుదారు బ్యాంక్ పాస్‌బుక్

► ఓటరు గుర్తింపు కార్డు

► పాస్‌పోర్ట్ సైజు ఫోటో

► గుర్తింపు కార్డు

► డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్

► మీ యాజమాన్యంలో ఉన్న భూమి యొక్క పూర్తి వివరాలు.

► నివాస ధృవీకరణ పత్రం

ఇవి కూడా చదవండి:

SBI Car Loan: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. 90 శాతం రుణం..!

SBI Scheme: కోవిడ్‌ సోకిన వారి కోసం ఎస్‌బీఐ ఈ ప్రత్యేక స్కీమ్‌ 3 నెలల ముందే నిలిపివేత.. ఇక రూ.20,000 పొందలేరు