PM Kisan 12th Installment: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే..!

|

Aug 16, 2022 | 8:06 PM

PM Kisan 12th Installment: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆర్థికంగా ఆసరా ఉండేందుకు కేంద్ర సర్కార్‌..

PM Kisan 12th Installment: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే..!
Pm Kisan
Follow us on

PM Kisan 12th Installment: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆర్థికంగా ఆసరా ఉండేందుకు కేంద్ర సర్కార్‌ ప్రధాన్‌ మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజనం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్‌ డబ్బులు త్వరలో అకౌంట్లో జమ కానున్నాయి. ప్రతి ఏడాది కేంద్రం దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6,000లను అందిస్తోంది. మూడు వితల్లో ఈ డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 11వ విడత రూ.2వేలను అకౌంట్లో జమ చేయగా, ఇప్పుడు 12వ విడత డబ్బులు రానున్నాయి. ఈ విడత డబ్బులు ఆగస్టు 31 లేదా సెప్టెంబర్‌ 1వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

కేవైసీ తప్పనిసరి:

ఈ పథకంలో డబ్బులు పొందాలంటే రైతులు కేవైసీ చేసి ఉండటం తప్పనిసరి. ఈ కేవైసీని పూర్తి చేసుకునేందుకు జూలై 31తో ముగిసింది. ఆలోపే కేవైసీ చేసుకున్న రైతులకు ఈ 12వ విడత డబ్బులు అకౌంట్లు జమ కానున్నాయి. కేవైసీ చేయని రైతులకు డబ్బులు అందవని గుర్తించుకోవాలి.

ఇవి కూడా చదవండి

పీఎం కిసాన్‌ డబ్బులు చెక్‌ చేసుకోవడం ఎలా..?

12వ విడత డబ్బులు పడగానే అకౌంట్లో వచ్చాయా ? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అర్హులైన రైతులు తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయో లేదా తెలుసుకోండి.

☛ ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ కి లాగిన్ కావాలి.

☛ తర్వాత హోమ్ పేజీ నుంచి ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

☛ అ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

☛ తర్వాత పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల జాబితా అనే పేజీపై క్లిక్ చేయాలి.

☛ డ్రాప్ డౌన్ జాబితా లో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి.

☛ ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది.

అన్ని వివరాలను పూర్తిచేసిన తర్వాత మీకు అర్హత ఉన్నప్పటికీ లబ్దిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే మీరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి