PM Kisan: రైతులకు అలర్ట్.. భార్యభర్తలిద్దరికీ పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందవచ్చా ?.. మారిన రూల్స్ తెలుసుకున్నారా ?..

|

Jul 04, 2022 | 9:06 AM

ఇప్పటివరకు 11 విడతల నగదును రైతుల అకౌంట్లలో వేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో చాలా మార్పులు జరిగాయి. ప్రణాళిక.. దరఖాస్తుకు సంబంధించిన అంశాలు, అర్హతలు, కొత్త నియమాలు చేర్చబడ్డాయి.

PM Kisan: రైతులకు అలర్ట్.. భార్యభర్తలిద్దరికీ పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందవచ్చా ?.. మారిన రూల్స్ తెలుసుకున్నారా ?..
Pm Kisan
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం ద్వారా దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి రైతుల ఖాతాల్లో రూ. 6000 జమవుతున్నాయి. ఏడాదికి మూడు విడతల వారిగా ఈ నగదు వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. ప్రతి విడతలో రూ. 2000 చొప్పున కేంద్రం అందిస్తుంది. ఇప్పటివరకు 11 విడతల నగదును రైతుల అకౌంట్లలో వేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో చాలా మార్పులు జరిగాయి. ప్రణాళిక.. దరఖాస్తుకు సంబంధించిన అంశాలు, అర్హతలు, కొత్త నియమాలు చేర్చబడ్డాయి. ఇప్పుడు భార్యభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను పొందవచ్చా ? లేదా ? అని.. మారిన నియమాల గురించి తెలుసుకుందామా.

పీఎం కిసాన్ స్కీమ్ నియమాల ప్రకారం భార్యభర్తలిద్దరూ ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ఇలా ఎవరైనా భార్యభర్తలిద్దరూ పీఎం కిసాన్ నగదు పొందితే వారి నుంచి డబ్బును రికవరీ చేస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా వారి ఖాతాను పేక్ అకౌంట్ కిందకు మారుస్తుంది. ఈ పథకం ద్వారా అనర్హులు నగదు పొందితే వారు వాయిదాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే వారికి ఈ స్కీమ్ బెనిఫిట్స్ వర్తించవు. అంటే భార్యభర్తలిద్దరిలో ఎవరైనా గతేడాది ఆదాయపు పన్ను చెల్లించి ఉంటే వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు.

ఒక రైతు తన వ్యవసాయ భూమిని వ్యవసాయం కోసం వినియోగించకుండా.. ఇతర పనులను ఉపయోగిస్తే.. లేదా ఇతరుల పొలాల్లో వ్యవసాయం చేసినప్పటికీ వారికి పీఎం కిసాన్ ప్రయోజనాలు వర్తించవు. వీరు పీఎం కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించబడతారు. అలాగే ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ పొలం అతని పేరు మీద కాకుండా వారి తండ్రి, తాత పేరు మీద ఉన్న అతనికి ఈ స్కీమ్ ప్రయోజనాలు వర్తించవు.

ఇవి కూడా చదవండి

వ్యవసాయ భూమి ఉండి.. ప్రభుత్వ ఉద్యోగం లేదా పదవి విరమణ చేసినవారు.. సిట్టింగ్ లేదా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయినవారికి కూడా ఈ పథకానికి అనర్హులే. ప్రొఫెషనల్ రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా వారి కుటుంబ సభ్యులు కూడా అనర్హులే. ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలకు కూడా ఈ పథకం ప్రయోజనం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.