PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి.. ఎలా చేయాలంటే..

|

Mar 05, 2022 | 2:03 PM

దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan).

PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి.. ఎలా చేయాలంటే..
Pm Kisan
Follow us on

దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan). ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ నగదును ఒకేసారి కాకుండా.. విడతల వారిగా జమచేయనున్నారు. పీఎం కిసాన్ నగదు.. కేవలం సొంతంగా భూమి కల్గిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ కింద 10 విడతలుగా నగదును అందచేశారు. త్వరలోనే 11వ విడత నగదును అందించనున్నారు.

ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్ సైట్‏లో eKYCని అప్డేట్ చేయడం తప్పనిసరి.అలాగే.. రైతులు తమ పీఎం కిసాన్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి. ఇందుకు రైతులు సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఓటీపీ ఆధారిత ఆధార్ కార్డ్ లింరక్ చేయవచ్చు. రైతులు తమ ఆధార్ వివరాలను పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఎంటర్ చేయడం.. తప్పులుంటే సవరించుకోవాలి.

పీఎం కిసాన్ వెబ్‏సైట్‏లో ఆధార్ లింక్ ఎలా చేయాలి..

1. ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి.

2. హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేయాలి.

3. ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

4. ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్, బ్యాంక్ అకౌంట్, ఫార్మర్ నంబర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి.

5. ఆధార్ నంబర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

6. ఆ తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్ చేసి అప్డేట్ పై క్లిక్ చేయాలి.

7. దీంతో ఆధార్ వివరాలు అప్డేట్ అవుతాయి.

పీఎం కిసాన్ ఖాతతో ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది. దీంతో అన్ని వివరాలు అప్డే్ట్ అవుతాయి. ఒకవేళ ఓటీపీ ఎర్రర్ వస్తే.. రైతులకు బదులు.. వారి బయోమెట్రిక్‏లను అప్డేట్ చేయడానికి సీఎస్సీ కేంద్రాలను సందర్శించాలి.

eKYCని అప్డేట్ చేయడం..

1. ముందుగా పీఎం కిసాన వెబ్ సైట్ లాగిన్ కావాలి.

2. ఆ తర్వాత రైట్ సైడ్ పైన కనిపించే eKYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

3. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

4. ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.

5. ఆ తర్వాత ఓటీపీ పొందండి పై క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయాలి.

కొన్నిసార్లు ఓటీపీ ఎంటర్ చేయడంలో సమస్యలు తలెత్తవచ్చు.. టైమ్ అవుట్.. వంటి ఎర్రర్ వస్తుంది.

Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..

Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..

మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..