
దేశ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అండగా నిలిచేందుకు పెట్టుబడి సహాయం కింద కేంద్రం పీఎం కిసాన్ పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏడాదిలో 3 సార్లు ఎకరానికి రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు ఈ పథకం కింద ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా 23 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసిన కేంద్రం.. తాజాగా 24వ విడత డబ్బులు వేసేందుకు కూడా సిద్ధమైంది.
పీఎం కిసాన్ రూ.10వేలకు పెంపు.. కేంద్రం క్లారిటీ
అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చే వార్షిక సాయాన్ని రూ. 6,000 నుండి రూ. 10,000కు పెంచనుందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాజాగా ఈ ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఇది రైతులను తప్పుదోవ పట్టించే పనని స్పష్టం చేసింది.
గతంలో మాదిరిగానే అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 మాత్రమే అందుతాయని క్లారిటీ ఇచ్చింది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో అంటే ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది.
#PMKISAN के तहत ₹10,000 सालाना मिलने की भ्रामक खबर से सावधान!
वायरल दावा: ₹10,000 सालाना
सही जानकारी: पात्र किसान परिवारों को ₹6,000 सालाना, तीन समान किस्तों में दिए जाते हैंसही जानकारी के लिए केवल आधिकारिक सरकारी स्रोतों पर भरोसा करें।
वेबसाइट: https://t.co/RFsuz95f5Z pic.twitter.com/jnv2T6qeia— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) September 8, 2026
పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు వస్తుంది?
అయితే దేశంలో వర్షాలు లేక చాలా మంది రైతులు వేసినా పంటలు విత్తులు రాక మళ్లీ వేయాల్సి వస్తుంది. దీని వల్ల రైతులకు ఆర్థిక భారం పెరుగుతుంది. దీంతో తెలంగాణలో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే 24వ విడత ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.