దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan). ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. అయితే వీటిని ఒకేసారి అన్నదాతలకు అందించకుండా.. విడతలుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఒక్కో విడతలో రూ. 2000 రైతుల ఖాతాల్లో జమకానుంది. మొదటి విడత.. ఏప్రిల్, జూలై మధ్య ఉంటుంది.. రెండవ విడత.. ఆగస్ట్, నవంబర్ మధ్య.. మూడవ విడత డిసెంబర్..మార్చి మధ్య ఉంటుంది. ఇప్పటికే కేంద్రం రైతులకు 9 విడతలుగా నగదు జమచేసింది. ఇక పదవ విడత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ పదవ విడత డబ్బులు డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ నగదు చెక్ చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. కుడివైపున ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అఅందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ స్టేటస్ చూడటానికి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ పేరు జాబితాలో ఉంటే.. మీకు నగదు వివరాలు కనిపిస్తాయి.
మొబైల్ యాప్ ద్వారా పీఎం కిసాన్ జాబితాలో పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను ఎంటర్ చేసి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు.. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనాలు అందుతాయి.
Also Read: Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..
Puneeth Rajkumar: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని..
Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..