AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric car: విద్యుత్ కారు కొనాలనుకుంటే.. ముందు వీటి గురించి తెలుసుకోండి.. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు..

అన్ని దేశాల్లోనూ ఈ వాహనాలు పెద్ద సంఖ్యలో లాంచ్ అవుతున్నాయి. కొనుగోళ్లకు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఎక్కువగా స్కూటర్లు, కార్లు, బైక్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వాహనాలతో లాభాలే కాదు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. మీరు విద్యుత్ శ్రేణి వాహనాలు కొనుగోలు చేసే ముందు వాటి వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందుల గురించి ముందుగా తెలుసుకోవాలి. లేకుంటే కొనుగోలు చేసిన తర్వాత బాధపడతారు.

Electric car: విద్యుత్ కారు కొనాలనుకుంటే.. ముందు వీటి గురించి తెలుసుకోండి.. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు..
Electric Car Charging
Madhu
|

Updated on: Aug 19, 2023 | 7:00 AM

Share

కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. అన్ని దేశాల్లోనూ ఈ వాహనాలు పెద్ద సంఖ్యలో లాంచ్ అవుతున్నాయి. కొనుగోళ్లకు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఎక్కువగా స్కూటర్లు, కార్లు, బైక్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వాహనాలతో లాభాలే కాదు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. మీరు విద్యుత్ శ్రేణి వాహనాలు కొనుగోలు చేసే ముందు వాటి వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందుల గురించి ముందుగా తెలుసుకోవాలి. లేకుంటే కొనుగోలు చేసిన తర్వాత బాధపడతారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం..

చార్జింగ్.. ఎలక్ట్రిక్ కార్లలో ప్రధాన సమస్య ఇది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లకున్న వెసులు బాటు విద్యుత్ శ్రేణి కార్లకు ఉండటం లేదు. పెట్రోల్ బంకుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ కారు రీఫిల్ చేసుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ కార్లలో ఆ పరిస్థితి ఉండదు. ప్రత్యేకించిన చార్జింగ్ స్టేషన్లలోనే వాటికి చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల లాంగ్ వెళ్లాలనుకోనే వారికి వీటిని ప్రిఫర్ చేయరు.

రేంజ్.. వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ రోజు రోజోకీ పెరుగుతోంది. కానీ అది వినియోగదారుల అవసరాలను తీర్చేంత స్థాయిలో లేదు. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై గరిష్టంగా ఎంత రేంజ్ ఇస్తుంది అనే విషయమై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేయాలనుకొనే వారికి ఇబ్బందిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భద్రత.. ఎలక్ట్రిక్ కార్లు మన మార్కెట్ కి చాలా కొత్త. వీటి భద్రత విషయంలో చాలా మందికి భయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్లలోని బ్యాటరీలు పేలి పోతున్నాయని, త్వరగా మండిపోతున్నాయన్న వార్తలు కూడా కొనుగోలు దారులను ఆలోచింపజేస్తున్నాయి.

డ్రైవింగ్ డైనమిక్స్.. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అది చేసే శబ్దానికి కొంత మంది ఫ్యాన్స్ ఉంటారు. కారు కంపెనీలు, బ్రాండ్లను బట్టి కారు సౌండింగ్ ఉంటుంది. ఇంజిన్ లో కంబషన్ జరుగుతుంది కాబట్టి, ఎగ్జాస్ట్ పైప్ ద్వారా ఎయిర్ బయటకు పోతున్నప్పుడు సౌండ్ వస్తుంది. దానిని ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇవేమి ఉండదు. ఎటువంటి సౌడ్లు ఉండవు. దీంతో కొంతమందికి అసలు డ్రైవ్ చేస్తున్నామనే భావనే ఉండటం లేదు.

అధిక ధరలు.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా దానిలోని బ్యాటరీ సైజ్ లను బట్టి రేటు మారిపోతోంది. ఒక సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిన్ ఇంజిన్ కారు రూ. 6లక్షలోపు వచ్చేస్తుంది. అదే ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరే రూ. 8 నుంచి రూ. 9 లక్షల నుంచి ఉంటున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..