Education In US: పిల్లలను విదేశాల్లో చదివించేందుకు ఇప్పటి నుంచి ఇలా ఇన్వెస్ట్ చేసుకోండి..

|

Mar 25, 2022 | 1:57 PM

Education In US: చాలా మంది విదేశాల్లో చదువుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. అందుకు అతను అర్హత కలిగి ఉన్నప్పటికీ కానీ.. అక్కడ చదువుకోవడానికి అవసరమైన నిధులు అతనివద్ద చాలా మంది వద్ద ఉండవు.

Education In US: పిల్లలను విదేశాల్లో చదివించేందుకు ఇప్పటి నుంచి ఇలా ఇన్వెస్ట్ చేసుకోండి..
Savings
Follow us on

Education In US: చాలా మంది విదేశాల్లో చదువుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. అందుకు అతను అర్హత కలిగి ఉన్నప్పటికీ కానీ.. అక్కడ చదువుకోవడానికి అవసరమైన నిధులు అతనివద్ద చాలా మంది వద్ద ఉండవు. అందువల్ల చాలా మంది తమ డ్రీమ్ ను శాక్రిఫైజ్(Sacrifice) చేసి మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఉద్యోగాలు చేస్తుంటారు. కనీసం తమ పిల్లలనైనా విదేశాల్లో చదివించాలని వారు భావిస్తుంటారు. దానికోసం ఇప్పుడే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలని భావిస్తుంటారు.

హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ ప్లానింగ్(Financial Planning) కోసం మీరు చాలా అంశాలను పరిశీలించాలి. అందులో మెుదటిది సమయం. ప్రస్తుతం ప్రవీణ్ విషయంలో అది 15 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె కుమార్తె చదువుకు అయ్యే ఖర్చు గురించి చూద్దాం. ఇప్పుడు US నుంచి MBA చేయడానికి యావరేజ్ గా 27 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. సేఫ్ సైడ్ కోసం దానిని మనం 30 లక్షలుగా తీసుకుందాం. దానిని అదనంగా 10 లక్షల రూపాయలు ఇతర ఖర్చులను కలుపుకుందాం. ఈ లెక్క ప్రకారం USలో MBA చేయడానికి.. మీకు 2 సంవత్సరాలకు గాను 80 లక్షల రూపాయలు కావాల్సి ఉంటుంది. అయితే.. ఇది ఈ రోజు లెక్కల ప్రకారం అయ్యే ఖర్చని మనం గుర్చుంచుకోవాలి. 2021-22 ఎకడమిక్ ఇయర్ లో అమెరికాలో ఎడ్యుకేషన్ ఫీజ్ లు 1 నుంచి 2 శాతం వరకు పెరిగాయి. దీనికి తోడు US టార్కెట్ ఇన్ఫేషన్ రేటు 2 శాతంగా ఉంది. దీని ప్రకారం అక్కడ లివింగ్ ఎక్పెన్సెస్ + ఫీజ్ సంవత్సరానికి 2 శాతం మేర పెరుగుతాయని మనకు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ లో టార్కెట్ ఇన్ఫేషన్ రేటు 4 శాతంగా ఉంది. యుఎస్, ఇండియా.. రెండు దేశాలూ తమ టార్గెట్ రేటును కొనసాగిస్తాయని అనుకున్నట్లయితే.. రూపాయి విలువ ప్రతి సంవత్సరం సగటున 2 శాతం మేర క్షీణించవచ్చు. ఈ విధంగా 15 ఏళ్ల తర్వాత.. రెండేళ్ల MBA పూర్తి చేయటానికి 1.4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనమాట.

దీనికోసం అవసరమైన ఫైనాన్సియల్ కార్పస్ ఎలా సమకూర్చుకోవాలి. ఇందుకోసం సాంప్రదాయ పొదుపు పథకాలైన PPF, SSY వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫేషన్ రేటు సర్దుబాటు చేసిన తర్వాత.. వీటి నుంచి వచ్చే వడ్డీ రేటు టార్గెట్ చేరుకునేందుకు సరిపోదు. అందుకే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. కానీ.. మీరు ఒకటి లేదా రెండు స్టాక్‌లలో పెట్టుబడి పెడితే అది చాలా ప్రమాదకరం. అందువల్ల.. వివిధ రంగాలకు చెందిన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టటం ఉత్తమం. దీనిని డైవర్సిఫికేషన్ అని అంటారు. ఇలా చేయటం వల్ల పెట్టుబడిపై వచ్చే నష్టాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఈ స్టాక్ మార్కెట్ డైవర్సిఫికేషన్ ప్లానింగ్ మిమ్మిల్ని భయపెడుతున్నట్లయితే.. జస్ట్ రిలాక్స్ అయి.. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి. ఫండ్ మేనేజర్ సెన్సెక్స్ లేదా నిఫ్టీ వంటి మార్కెట్ ఇండెక్స్‌ రాబడులను ప్రతిబింబించే విధంగా పెట్టుబడి పెడతాడు. మార్కెట్లో అనేక కారణాల వల్ల కొన్ని స్టాక్స్ పడిపోవచ్చు.. కానీ మార్కెట్లు సాధారణంగా తిరిగి పుంజుకుని బౌన్స్ బ్యా్క్ అవుతుంటాయి. కాబట్టి.. ఇండెక్స్ ఫండ్స్ మీకు సరైన రిస్క్, రిటర్న్ బ్యాలెన్స్‌ను అందిస్తాయి. ఇన్వెస్ట్ మెంట్ లో ఒడిదొడుగుల గురించి దీర్ఘకాల వ్యవధిలో.. మార్కెట్ చూసుకుంటుంది.

చాలా మంది పెట్టుబడిదారులు తమ పిల్లలకు విదేశీ విద్య కోసం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకున్నప్పుడు అందుకోసం ఈక్విటీ ఎసట్ క్లాసెస్ లో పెట్టుబడులు పెట్టటం ఉత్తమమని ప్లాన్ అహెడ్ CEO విశాల్ ధావన్ అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినప్పుడు షేర్లలో వచ్చే ఓలటాలిటీని మార్కెట్ సరిచేస్తుందని ఆయన తెలిపారు. ఎడ్యుకేషనల్ గోల్స్ దగ్గరపడే సమయంలో డొమస్టిక్, ఇంటర్నేష్నల్ ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ ను విత్ డ్రా చేసి డెట్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. టాప్ ఇండెక్స్ ఫండ్స్ సంవత్సరానికి యావరేజ్ గా 15% రాబడిని ఇస్తాయి. కానీ మనం ముందస్తు జాగ్రత్తలో భాగంగా దానిని 13 శాతంగా కుదించుకుందాం. ఈ లెక్క ప్రకారం 15 సంవత్సరాల తరువాత అమెరికాలో ఎంబీఏ చదవటానికి అవసరమైన 1.4 కోట్ల రూపాయల కార్పస్ సమకూర్చుకోవటానికి నెలకు 25 వేల 194 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిల్డ్రన్స్ ఫండ్ లాంటి సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అయితే.. ఆ ఫండ్‌ల పరిమాణం చాలా పెద్దది కావు. అవి యాక్టివ్ లీ మ్యానేజ్డ్ ఫండ్స్ కావటం వల్ల ఫండ్ మేనేజర్ తన ఎనాలసిస్ ప్రకారం వివిధ స్టాక్స్ లో ఫండ్ సొమ్మును ఇన్వెస్ట్ చేస్తాడు. అందువల్ల వాటిలో ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ ఫండ్లలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిదని సూచిస్తున్నారు.

ఈ విషయంలో మనీ-9 మీకు ఏమి సూచిస్తుండంటే.. ప్రతి ఒక్కరూ హైయర్ ఎడ్యుకేషన్ పై చేసే ఇన్వెస్ట్ మెంట్ చాలా ముఖ్యమైనది. కాబట్టి దానికి ఫైనాన్సియల్ ప్లానింగ్ రూపొందించడం ఎల్లప్పుడూ మంచిది. అది కూడా ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచిది. SIP ద్వారా ప్రతి నెలా పెట్టుబడి పెట్టండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కాబట్టి.. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఉత్తమం. మీరు మెచూరిటీకి దగ్గరగా చేరుకునే కొద్దీ.. కొంత మెుత్తంలో క్రమంగా ఇన్వెస్ట చేసిన డబ్బు బయటకు తీసుకోవటం ప్రారంభించాలి. మేము ఇలా ఎందుకు సూచిస్తున్నామని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత మార్కెట్ పరిస్థితిని బాగా పరిశీలిస్తే మీకు ఇందుకు హింట్ లభిస్తుంది. మార్కెట్ ఎప్పుడు క్రాష్ అవుతుందో మనకు తెలియదుకాబట్టి.. క్రాష్ ల్యాండింగ్‌ను నివారించటంలో భాగంగా క్రమంగా బ్రేక్‌ తీసుకోవటం మంచిది.

ఇవీ చదవండి..

Advance Tax: అడ్వాన్స్ టాక్స్ ఎవరైనా చెల్లించవచ్చా..? ఐటీ యాక్ట్ ఏమి చెబుతోందంటే..

Snake In Wine Bottle: వైన్​ బాటిల్ లో పాము.. సంవత్సరం తరువాత తీసి చూస్తే ఏమైందంటే..