AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Claims: వాహన బీమా క్లెయిమ్‌ల కోసం చిత్ర విచిత్ర రిజన్లు.. కుక్కల ద్వారా కూడా భారీ నష్టం

లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ 20కి పైగా వాహన బీమా క్లెయిమ్‌లు ఏనుగుల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సందర్భాలకు సంబంధించినవని పేర్కొన్నారు. లక్నోలోని ఇందిరా నగర్ ప్రాంతంలో కుక్కల వల్ల 110 వాహనాలకు నష్టం వాటిల్లింది. అలాగే పలు చోట్ల నెమళ్లు కూడా అద్దంపై ఉన్న ప్రతిబింబంపై కోపంతో పొడవడం వల్ల కూడా కార్లకు నష్టం కలిగింది.

Insurance Claims: వాహన బీమా క్లెయిమ్‌ల కోసం చిత్ర విచిత్ర రిజన్లు.. కుక్కల ద్వారా కూడా భారీ నష్టం
insurance claim
Nikhil
|

Updated on: Jan 20, 2024 | 2:30 PM

Share

భారతదేశంలోని మోటారు ప్రమాద బీమా సంస్థలు పాలసీదారుల నుంచి విచిత్రమైన క్లెయిమ్‌లను ఎదుర్కొంటున్నాయి. ఇందులో వీధికుక్కల దాడితో పాటు కొబ్బరికాయల వల్ల నష్టం కూడా ఉందని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అలాగే లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ 20కి పైగా వాహన బీమా క్లెయిమ్‌లు ఏనుగుల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సందర్భాలకు సంబంధించినవని పేర్కొన్నారు. లక్నోలోని ఇందిరా నగర్ ప్రాంతంలో కుక్కల వల్ల 110 వాహనాలకు నష్టం వాటిల్లింది. అలాగే పలు చోట్ల నెమళ్లు కూడా అద్దంపై ఉన్న ప్రతిబింబంపై కోపంతో పొడవడం వల్ల కూడా కార్లకు నష్టం కలిగింది. కాబట్టి వాహన బీమాల్లో వచ్చే చి​త్ర విచిత్ర క్లెయిమ్స్‌ వివరాలనుతో ఓ సారి తెలుసుకుందాం.

సాధారణ క్లెయిమ్‌లు

కార్ డ్యామేజ్ క్లెయిమ్‌లకు ప్రధాన కారణం ట్రాఫిక్‌లో ఫ్రంటల్ డ్యామేజ్ నుంచి వస్తున్నాఇయ. తదుపరి అత్యంత సాధారణ ఉదాహరణ వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో దెబ్బతిందనే కారణంతో క్లెయిమ్‌ కోసం అప్లయ్‌ చేస్తున్నారు. వాహనం హిట్-అండ్-రన్ కేసులు కూడా కారు బీమా క్లెయిమ్‌లకు ప్రబలంగా ఉన్నాయి. సాధారణంగా వాహనం నష్టానికి సంబంధించిన క్లెయిమ్‌లను 7 రోజుల్లోపు లేదా సంఘటన జరిగిన 48-72 గంటలలోపు దాఖలు చేయాలి. వాహనాలకు జరిగే సొంత నష్టం సమగ్ర కారు బీమా ద్వారా మాత్రమే కవర్ అవుతుంద

జంతువుల వల్ల నష్టాలు

కొన్ని రాష్ట్రాలు ఏనుగు వాహనాలను ధ్వంసం చేసిందనే కారణంతో కూడా బీమా క్లెయిమ్‌ చేస్తున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏనుగులు వాహనాలను ధ్వంసం చేశాయని బీమా క్లెయిమ్‌ చేస్తూ ఉంటారు. గేదెలు, మేకలు, పార్క్ చేసిన వాహనాలపై కోతులు వస్తువులను విసిరాయని కూడా క్లెయిమ్‌ చేస్తూ ఉంటారు. వాహనాలపై కొమ్మలు లేదా కొబ్బరికాయలు పడడం వల్ల నష్టం వచ్చిందని క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్నాయని బీమీ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

2023లో ఆసక్తికర బీమా క్లెయిమ్‌లు

నవజాత శిశువుల పేరుతో 215 బీమా పాలసీలను జారీ చేసినట్లు జీవిత బీమా కవర్లను కూడా పంపిణీ చేసే ఓ బీమా సంస్థ నివేదించింది.  బీమా సంస్థ జూలై 13, 2023న 1.50 గంటల సుదీర్ఘ కాల్‌ని అందుకుంది. ఇది సంవత్సరంలో అత్యంత సుదీర్ఘమైన కాల్‌గా ఉంది. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున అత్యల్ప వ్యాపారంగా నమోదైంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి