- Telugu News Photo Gallery Business photos Supercars at a low price in the market, Amazing features with stunning looks, Budget Cars details in telugu
Budget Cars: మార్కెట్‌లో తక్కువ ధరకే సూపర్ కార్స్.. స్టన్నింగ్ లుక్‌తో అమేజింగ్ ఫీచర్స్
భారతదేశం బడ్జెట్ కార్ల మార్కెట్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల కాలంలో కార్ల తయారీదారులు మరిన్ని ఫీచర్లను జోడించడం ద్వారా వారి బడ్జెట్ ఆఫర్లను కూడా మెరుగుపరుస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు కుటుంబ సభ్యులతో పాటు సామగ్రి తరలించడానికి తగినంత స్థలాన్ని కోరుకోవడంతో కొంచెం పెద్ద సైజ్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి భారతదేశంలో సూపర్ హిట్ అయిన రూ.7.5 లక్షల కంటే తక్కువ ధర కలిగిన 5 బడ్జెట్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Jan 20, 2024 | 3:00 PM

టాటా పంచ్ ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారు చిన్నది అయినప్పటికీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఇది భారతీయ రోడ్లకు చాలా ఆచరణాత్మక వాహనంగా ఉంటుంది. టాటా పంచ్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీకు జత చేసి వస్తుంద. ఈ కారు ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాటా పంచ్ కూడా సీఎన్‌జీ ఎంపికతో వస్తుందిజ డ్యూయల్-ట్యాంక్ టెక్నాలజీ కారణంగా మీ లగేజీకి కూడా స్థలం ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్టర్ టాటా పంచ్ ప్రత్యక్ష పోటీదారుగా ఉంది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ ఆధారంగా రూపొందించారు. ఈ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో పని చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ జత చేశారు. సన్రూఫ్, డాష్ క్యామ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో వచ్చే ఈ కారు ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎక్స్‌టర్ సీఎన్‌జీ ఎంపికలో కూడా లభిస్తుంది

టాటా టియాగో ఒక అద్భుతమైన వాహనం. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏంఎటీ జత చేసి వస్తుంది. టియాగో ధర రూ. 5.59 లక్షలు. అలాగే ఈ కారు డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీతో పాటు సీఎన్‌జీ ఎంపిక కూడా ఉంది. ఇది ఇతర పోటీదారుల మాదిరిగా కాకుండా సామగ్రిని పెట్టుకోవడానికి స్థలం ఉండది

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ ఒక అద్భుతమైన సిటీ కారు. ఇది ఒకరికి అవసరమైన అన్ని ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ తన అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగ్లతో వస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ లేదా ఏఎంటీతో జత చేసి వస్తంది. ఈ కారు ధర రూ. 5.84 లక్షలుగా ఉంటుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. టాల్-బాయ్ డిజైన్ దాని స్థలం, ప్రాక్టికాలిటీ కారణంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వ్యాగన్ ఆర్ దాని టాప్ వేరియంట్లలో 1.0 లీటర్ల పెట్రోల్ లేదా 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్ ఎంపికతో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో జత చేసి వస్తుంది. వ్యాగన్ ఆర్ ధర రూ. 5.55 లక్షలుగా ఉంది.




