PIB Fact Check: జనవరి 1 నుంచి రూ.2వేల నోట్లు బ్యాన్.. ఇది నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్

|

Dec 20, 2022 | 12:22 PM

ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో ఏవోవో వైరల్ అవుతుంటాయి. వాటిని నమ్మి మోసపోయే వారు చాలా మంది ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే అంశాలపై జాగ్రత్తగా ఉండాలి. ఏవి నిజమో..

PIB Fact Check: జనవరి 1 నుంచి రూ.2వేల నోట్లు బ్యాన్.. ఇది నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్
Pib Fact Check
Follow us on

ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో ఏవోవో వైరల్ అవుతుంటాయి. వాటిని నమ్మి మోసపోయే వారు చాలా మంది ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే అంశాలపై జాగ్రత్తగా ఉండాలి. ఏవి నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా వినియోగదారులకు ఎవే వేస్తూ నిలువనా దోచుకుంటున్నారు. ఏవో పనికి రాని లింక్‌లను జోడిస్తూ నమ్మబలుకుతున్నారు. వాటిని క్లిక్‌ చేసిన వెంటనే మీ వ్యక్తిగత వివరాలు వారికి చేరి క్షణాల్లోనే మీ బ్యాంకులో డబ్బంతా ఖాళీ అయిపోతుంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాన్ చేస్తోందంటూ వస్తున్న వార్తలు సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్న ఇలాంటి వార్తలపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.

రెండు వేల రూపాయల నోటు రద్దు అవుతుందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు నమ్మవద్దని స్పష్టం చేసిందిన. ఇవన్ని నిజం కావని. అలాంటి వీడియోలు, వార్తలు, మెసేజ్‌లు వస్తే పార్వడ్‌ చేయవద్దని పీఐబీ సూచించింది.

ఇవి కూడా చదవండి

 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియో మెసేజ్ చూసిన జనంలో కొంతమంది అది నిజమేనని విశ్వసిస్తుండటంతో పాటు ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ వైరల్ మెస్సేజ్‌లో నిజం లేదని స్పష్టం చేసింది పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య కొత్తగా 2000 రకం నోట్లను ముద్రించలేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులు సమాధానంలో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..