PF New Rule: జాబ్‌లో చేరి 6 నెలలు కాకున్నా రూ.1 లక్ష విత్‌డ్రా.. కొత్త రూల్‌!

|

Sep 29, 2024 | 7:30 PM

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు ఏదైనా అత్యవసరమైన సమయాల్లో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్‌వో సరికొత్త రూల్‌ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల

PF New Rule: జాబ్‌లో చేరి 6 నెలలు కాకున్నా రూ.1 లక్ష విత్‌డ్రా.. కొత్త రూల్‌!
Epfo
Follow us on

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు ఏదైనా అత్యవసరమైన సమయాల్లో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్‌వో సరికొత్త రూల్‌ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఒకేసారి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ. 50,000 పరిమితి ఉండేది. కానీ నిబంధనలు మార్చిన తర్వాత లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

6 నెలలు పూర్తి కాకున్నా డబ్బులు తీసుకోవచ్చు:

ప్రస్తుత ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కూడా పూర్తి కాకున్నా కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. వివాహం, వైద్య చికిత్సల వంటి సందర్భాల్లో ఉద్యోగులను డబ్బు అత్యవసరంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ నిబంధన ఎంతగానో మేలు జరగనుంది.

ఇవి కూడా చదవండి

2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) పీఎఫ్‌ ఖాతాలపై 8.25 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అందిస్తోంది. ఈ వడ్డీ రేటు మధ్య తరగతి వేతన జీవులకు చాలా కీలకం. మరో కీలక సంస్కరణను కూడా సర్కారు తీసుకొచ్చింది. గతంలో, EPFO పార్ట్‌నర్‌షిప్‌ నుంచి మినహాయించిన కంపెనీలను ప్రభుత్వ రంగ ‘రిటైర్మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌’కు మార్చడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలా మినహాయింపు పొందిన సంస్థలు, ప్రధానంగా 1954లో ఈపీఎఫ్‌వో ఏర్పాటుకు ముందున్న పదవీ విరమణ పథకాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు ఇప్పుడు ఈపీఎఫ్‌వో కిందకు వచ్చే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

అలాగే ప్రస్తుతం ఉన్న రూ. 15,000 ఆదాయ పరిమితిని పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిపైన ఉన్న వాళ్లు ప్రావిడెంట్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయడం తప్పనిసరి. రూ.15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు, రిటైర్మెంట్ సేవింగ్స్‌ అండ్‌ పెన్షన్‌ కోసం తమ ఆదాయంలో ఎంత కేటాయించాలనుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు ఇప్పుడు ఎక్కువ సౌలభ్యం లభిస్తోంది. అంతేకాదు ఎంప్లాయీస్‌ స్టేట్ ఇన్సూరెన్స్‌కు (ESI) వర్తించే రూ. 21,000 థ్రెషోల్డ్‌ని పెంచే ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం టేబుల్‌పై ఉన్నాయి.

ఇది కూడా చదవండి: PM Kisan: గుడ్‌న్యూస్‌.. ఆ రైతులకు పీఎం కిసాన్‌ స్కీమ్‌లో 4 వేలు పెంపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి