ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పెద్ద మార్పు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు ఇప్పుడు 50 వేలకు బదులుగా రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వారం ప్రారంభంలో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో పాటు నిబంధనలలో మరో మార్పు చేశారు.
మీరు ఈపీఎఫ్‌వో ఖాతాదారుని అయితే, కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఉంటే, ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చునని మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఏక మొత్తం పరిమితిని పెంచినట్లు తెలిపారు. అలాగే, ఉద్యోగం ప్రారంభించిన 6 నెలల్లోపు ఉపసంహరణ సౌకర్యం కూడా ఉంది. గతంలో పీఎఫ్ ఖాతాదారులు చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చేది. అంటే 6 నెలల్లో ఉద్యోగం వదిలేసినా.. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈపీఎఫ్‌ఓ కార్యకలాపాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇది వినియోగదారుల ఇబ్బందులను తొలగించే విధంగా ఉందన్నారు. ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేసే కొత్త డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో డబ్బును త్వరగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఏ అవసరాల కోసం మీరు ఈ ఫండ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు:
ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకు అనేక రకాల సేవలను అందిస్తుంది. ఇది పెన్షన్ నుండి వైద్య లేదా ఇతర ముఖ్యమైన ప్రయోజనాల వరకు ప్రతిదానికీ నిధుల ఉపసంహరణను అనుమతిస్తుంది. అత్యవసర నిధిగా ఇప్పుడు పీఎఫ్ నుండి రూ. 50,000 బదులుగా రూ. 1 లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే మీరు వైద్యం, వివాహం, విద్య లేదా ఇతర ముఖ్యమైన కుటుంబ అవసరాల కోసం పీఎఫ్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి