PF Alert: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక..! ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది..?

|

Oct 31, 2021 | 6:32 PM

PF Alert: ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, లాటరీల ద్వారా ఇలా చాలా మార్గాల

PF Alert: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక..! ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది..?
Pf Alert
Follow us on

PF Alert: ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, లాటరీల ద్వారా ఇలా చాలా మార్గాల ద్వారా సైబర్‌ నేరస్థులు డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి పీఎఫ్ ఖాతా కూడా చేరింది. అందుకే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సోషల్ మీడియా పేజీలలో ఆన్‌లైన్ మోసాల గురించి సభ్యులను హెచ్చరిస్తూ ఒక సలహాను జారీ చేసింది. ఇతరులతో EPFO సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని సభ్యులను కోరింది. EPFO ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంక్ ఖాతా, ఓటీపీ ఆన్ కాల్, వాట్సాప్ లేదా సోషల్ మీడియా వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ అడగదని స్పష్టం చేసింది.

EPFO సేవలను పొందేందుకు PF ఖాతాదారులను డబ్బును డిపాజిట్ చేయమని అడగదు. ఇలా ఎవరైనా కాల్‌ చేస్తే సమాధానం ఇవ్వవద్దని సూచించింది. మరిన్ని వివరాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం, ఖాతాదారులు EPFOని https://epfigms.gov.inలో సంప్రదించవచ్చు లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800-118-005కు కాల్ చేయవచ్చు. EPFO సభ్యులు కావాలనుకుంటే ప్రభుత్వం నిర్వహించే ప్లాట్‌ఫారమ్ UMANG యాప్‌లో ఈ సేవల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికైనా బహిర్గతం చేస్తే హ్యాకర్లు మీ EPF ఖాతాలోకి లాగిన్ అవుతారు. వారికి తెలియకుండానే మొత్తం డబ్బును కాజేస్తారు. ఇటీవల చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగాలు మారిన వారు, ఇంకా తమ ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయని వారు ఇలాంటి సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో EPFO, బ్యాంకు మోసాల దాడులు ఎక్కువగా పెరిగాయి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న అనేక రాకెట్లను లీగల్ ఏజెన్సీలు బయటపెట్టాయి. అయినా కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం.

Viral Photos: ఈ పువ్వు చాలా విశిష్టమైనది..! ఒక్క పురుగు కూడా దీనిపై వాలదు.. ఎందుకంటే..?

సిటీ యువతకి షాకింగ్‌ న్యూస్‌..! ఆ శక్తి పూర్తిగా తగ్గిపోతుందట.. కారణం ఇదే..?

Health: ఇమ్యూనిటీ తగ్గిందంటే కరోనా అటాక్..! అందుకే ఎల్లప్పుడు ఈ 4 సుగంధ ద్రవ్యాలు..