Petrol diesel prices today: స్థిరంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Dec 19, 2021 | 8:56 AM

Petrol Diesel Rate Today: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ చమురు కంపెనీలు డిసెంబర్ 19 ఆదివారం పెట్రోల్, డీజిల్ రేట్లను విడుదల చేశాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు...

Petrol diesel prices today: స్థిరంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Petrol Diesel Prices
Follow us on

దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు డిసెంబర్ 19 ఆదివారం పెట్రోల్, డీజిల్ రేట్లను విడుదల చేశాయి. నేటి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ. 95.41 పలుకుతుండగా, డీజిల్ లీటర్ రూ.86.67 గా ఉంది. ముంబయిలో పెట్రోల్ లీటరు రూ.109.98 ఉండగా, డీజిల్ ను రూ. 94.14కు విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

రాష్ట్ర హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62కు విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.49గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఏపీలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.57లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.59గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

Read Also.. ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి ఫిదా అవుతున్న జనాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..