Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే స్వల్ప మార్పులు

Petrol, Diesel Rates Today: దేశంలో కొన్ని రోజులనుంచి సామాన్యులకు చమురు ధరల నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం

Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే స్వల్ప మార్పులు
Petrol Diesel price Today

Updated on: Apr 23, 2021 | 6:25 AM

Petrol, Diesel Rates Today: దేశంలో కొన్ని రోజులనుంచి సామాన్యులకు చమురు ధరల నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులు లబోదిబోమన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరూ ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా..
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.93.87 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.93గా ఉంది. కాగా.. కరీంనగర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.96 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.45 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.36 ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.92 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.03 గా ఉంది.

Also Read:

Doctors Dance Videos: కరోనా దండయాత్రలో..ప్రజల నిరాశ నేట్టేయడానికి డాక్టర్లు వేసిన ఆశా మాత్రలు..ఈ వైరల్ వీడియోలు!

Indonesian Submarine : గల్లంతైన ఇండోనేషియా జలాంతర్గామి కోసం ముమ్మరంగా గాలింపు, రంగంలోకి భారత్