Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో మాత్రం ఇలా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి.

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో మాత్రం ఇలా..
Petrol Diesel Price
Follow us

|

Updated on: Oct 20, 2021 | 8:32 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.46గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 103.56గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.72గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 110.64గా ఉండగా.. డీజిల్ ధర రూ. 104.18గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.103.83గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా.. డీజిల్ ధర రూ.103.93గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.12గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.49 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.20 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 104.55గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.34లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.01గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.07గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.16గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 112.73 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.105.20లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 106.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.89 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.77 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 98.03 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 103.31 ఉండగా.. డీజిల్ ధర రూ.99.26గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.89 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.100.75గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.04 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.25గా ఉంది.