రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ముడిచమురు ధరలపై పడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పెరిగిన బ్యారల్ ధర.. నెమ్మదిగా దిగివచ్చింది. గత కొన్ని వారాల్లో ముడి చమురు బ్యారెల్ 100 మించిపోయింది. అయితే, ఈ వారం ముడి చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్ 99కి చేరుకుంది. భారతదేశంలోని చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయి. దీని ఫలితంగా సెంచరీ కంటే తక్కువ ఇంధన ధరలు తగ్గాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు (శుక్రవారం, మార్చి 18) ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరను బట్టి పెట్రోల్-డీజిల్ ధర నిర్ణయించబడుతుంది. ఇదిలావుంటే.. నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.99 ఉండగా.. డీజిల్ ధర రూ.94.82గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.91కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.38లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.40 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.51గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.28గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.38గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.91లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.96లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.18 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.88గా ఉంది.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..