Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.64గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 101.66గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.81గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.101.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.29గా ఉండగా.. డీజిల్ ధర రూ. 102.24గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.75గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.29గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.64 ఉండగా.. డీజిల్ ధర రూ.101.66గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.41 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.43గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.63 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.05 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.50 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.97గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.86 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.24గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.13గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.59గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.63 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.103.05లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 104.14 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.17 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.12కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.03గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.80 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.28 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.53 ఉండగా.. డీజిల్ ధర రూ.97.69గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107.77 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.18 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.61గా ఉంది.
ఇవి కూడా చదవండి: MAA Elections Winners: మంచుకే ‘మా’ పీఠం… ఉత్కంఠ పోరులో విష్ణు విజయం…