Petrol Diesel Price: దేశంలో అంతా ఓకే.. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎందుకిలా..

|

Aug 09, 2021 | 9:18 AM

Petrol Diesel Price: గత 24 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి  15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో

Petrol Diesel Price: దేశంలో అంతా ఓకే.. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎందుకిలా..
Petrol Diesel Price
Follow us on

Petrol-Diesel Rates Today: గత 24 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి  15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. సోమవారం తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.  

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.98గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 98.10గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.86 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.68గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.97గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.29ఉండగా.. డీజిల్ ధర రూ.98.39గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.30 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.87 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 99.05గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.30లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.17గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.14 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.72గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.30 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.87లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..